Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జలియన్ వాలా బాగ్ సామూహిక హత్య కాండ లో అమ‌రులైన వారి కి నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


జలియన్ వాలా బాగ్ సామూహిక హత్య కాండ లో అమ‌రులైన వారి కి ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

“భయావహమైన‌టువంటి జలియన్ వాలా బాగ్ సామూహిక హత్య కాండ కు వంద సంవ‌త్స‌రాలు కావడాన్ని మనం స్మ‌రించుకొంటున్నాం; ఆ నాడు ప్రాణ స‌మ‌ర్ప‌ణం చేసిన వారంద‌రి కి భార‌త‌దేశం నేడు నివాళులు అర్పిస్తోంది. వారి యొక్క వీరత్వం మ‌రియు త్యాగం ఎన్నటి కి మరపురానివి. వారు గ‌ర్వ‌ప‌డే విధం గా ఒక భార‌త‌దేశాన్ని నిర్మించ‌డం కోసం మనం అలుపెరుగకుండా మ‌రింత శ్ర‌మించేటట్టు వారి స్మృతి మనందరి కి ప్రేరణ ను అందిస్తోంది’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

******