Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ క్రీడ‌ల దినం సంద‌ర్భంగా క్రీడాకారులు, క్రీడ‌ల ప‌ట్ల ఉత్సాహం క‌న‌బ‌రిచే వారందరికీ అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి; విఖ్యాత హాకీ ఆట‌గాడు మేజ‌ర్ ధ్యాన్ చంద్ కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ క్రీడ‌ల దినం నాడు క్రీడాకారులకు మ‌రియు క్రీడ‌ల ప‌ట్ల ఉత్సాహం ప్ర‌ద‌ర్శించే వారంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. అలాగే విఖ్యాత భార‌తీయ హాకీ ఆట‌గాడు మేజ‌ర్ ధ్యాన్ చంద్‌ కు ప్ర‌ధాన మంత్రి నివాళులు అర్పించారు.

‘‘జాతీయ క్రీడా దినాన్ని పుర‌స్క‌రించుకొని క్రీడాకారుల‌కు మరియు అమిత ఉత్సాహంతో, ఉద్వేగంతో క్రీడ‌లలో పాల్గొనే ఔత్సాహికులంద‌రికీ ఇవే నా అభినంద‌లు.

అలాగే, ఆద‌ర్శ‌ప్రాయమైన భార‌తీయ హాకీ ఆట‌గాడు మేజ‌ర్ ధ్యాన్ చంద్ కు నేను నివాళులు అర్పిస్తున్న‌ాను. మేజ‌ర్ ధ్యాన్ చంద్ త‌న విఖ్యాత క్రీడా కౌశ‌లంతో భార‌తీయ హాకీ లో అద్భుతాలను సృష్టించారు.

శారీరిక దృఢ‌త్వాన్ని, మాన‌సిక అప్ర‌మ‌త్త‌త‌ను మ‌రియు వ్య‌క్తిత్వ వికాసాన్ని క్రీడలు ఒంటపట్టిస్తాయి.

భార‌త‌దేశం అపార‌మైన క్రీడా ప్ర‌తిభకు నిల‌యం. ఈ సామ‌ర్ధ్యాన్ని మ‌రింత‌గా పెంచి పోషించ‌డం కోసం ఒక పోర్ట‌ల్ ను ఇండియా స్పోర్ట్స్ ప్రారంభించింది.

యువ‌తీ యువ‌కులు వారి క్రీడా సంబంధ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చుకోవడానికి, రాణించ‌డానికి త‌గిన మ‌ద్ధ‌తును అందించ‌డంతో పాటు, అత్యంత అవ‌స‌ర‌మైన‌టువంటి దిశానిర్దేశాన్ని కూడా ది నేష‌న‌ల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్ట‌ల్ స‌మ‌కూరుస్తుంది’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.