Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ గృహ విధానం అభివృద్ధి మరియు నిర్వహణ లో భారతదేశానికి, కెన్యాకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం


జాతీయ గృహ విధానం అభివృద్ధి మరియు నిర్వహణ (ఎన్ హెచ్ పి డి ఎమ్)లో భారతదేశానికి, కెన్యా కు మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందానికి (ఎమ్ ఒ యు కు) కేంద్ర మంత్రివర్గం ఎక్స్ పోస్ట్- ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. 2016 జులై 11 వతేదీన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నైరోబీని సందర్శించినప్పుడు ఈ ఎమ్ ఒ యు పై సంతకాలు జరిగాయి.

ఈ ఎమ్ ఒ యులో భాగంగా గృహ‌ నిర్మాణ‌ం మరియు మానవ ఆవాసాలకు సంబంధించిన అన్ని విషయాలలోను సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అటు నుండి ఇటు- ఇటు నుండి అటు రాకపోకలు జరపడం, ఎక్స్ పోలు/ ప్రదర్శనలు, సమావేశాలు, వర్క్ షాపులు వంటి వివిధ వ్యూహాలను అవలంబించడం ద్వారా ఇరు పక్షాలు సమన్వయం ఏర్పరచుకొంటాయి.

మురికివాడల అవతరణను నివారించే దిశగా ప్రతి దేశం అమలు జరుపుతున్న ప్రక్రియ మరియు ఆ దేశం సంపాదించిన అనుభవం ఆధారంగా మురికివాడలలో సదుపాయాల మెరుగుదలకు కృషి చేయడంపై దృష్టి సారిస్తూ ఇరు దేశాలు సహకరించుకొంటాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన పురోగతితో పాటు స్థిరాస్తి మార్కెట్ లో నెలకొన్న ప్రస్తుత ధోరణులు, ఉత్తమ పద్దతులు మరియు పెట్టుబడి అవకాశాల వంటి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలోను రెండు దేశాలు సమన్వయం ఏర్పరచుకోనున్నాయి.

స్థానికంగా దొరికే భవన నిర్మాణ సామగ్రిని ఉపయోగించి అందుబాటు ధరలలో గృహ నిర్మాణ సంబంధ సాంకేతికతను ఈ ఎమ్ ఒ యు ప్రోత్సహించగలదు. ప్రభుత్వం/ ప్రజలు, ఉద్యోగులకు పాత్ర ఉండే గృహ నిర్మాణ రంగ కార్యకలాపాలు పెరిగేటట్లు సంబంధిత సాంకేతిక సహకారాన్ని కూడా ఇది ప్రోత్సహించగలదు. ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ పథకంలో మంచి నమూనాలను అన్వేషించడానికి సైతం ఇది ఉపయోగపడుతుంది. అలాగే, ప్రైవేటు రంగంలోని సంస్థలు కూడా ఈ తరహా గృహ నిర్మాణ పథకంలో పాలు పంచుకొనేందుకు అనువైన పరిస్థితులను కల్పించడానికి దోహదపడుతుంది.