Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా జంషెడ్‌ పూర్‌ నుంచి దేశ వ్యాప్తంగా పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా జంషెడ్‌ పూర్‌ నుంచి దేశ వ్యాప్తంగా పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా జంషెడ్‌ పూర్‌ నుంచి దేశ వ్యాప్తంగా పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమం ‘గ్రామోదయ్‌ సే భారత్ ఉదయ్ అభియాన్’ ముగింపు నకు కూడా వేదిక అయింది. ‘గ్రామోదయ్‌ సే భారత్ ఉదయ్ అభియాన్’ మహూ లో ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి నుంచి ప్రారంభం అయింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గ్రామాలలో సదుపాయాలు, సేవలు నగరాలతో దీటుగా ఉండాలని స్పష్టం చేశారు.

పంచాయతీ ప్రతినిధులు వారి పదవీకాలాన్ని ప్రజా సేవకు వినియోగించాలని, పల్లెలలో పెను మార్పును తీసుకు రావడమే ధ్యేయంగా పెట్టుకోవాలని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.

మరీ ముఖ్యంగా మహిళా సభ్యులు మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులలో నాయకత్వ భూమికను పోషించగలగాలని ఆయన అన్నారు.

చిన్నారుల విద్య పట్ల పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. పిల్లలు పాఠశాలకు వెళ్లటం ఆపేసినట్లయితే అది పంచాయతీ సభ్యులు ఆందోళన చెందాల్సిన విషయంగా గ్రహించాలన్నారు.

బడ్జెట్‌కు అతీతంగా పంచాయతీలు ఆలోచనలు చేయాలని ప్రోత్సహించిన ప్రధాన మంత్రి, జన సువిధపై దృష్టి పెట్టాలని కూడా సూచించారు.

కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం ప్రధాన మంత్రి వేదిక మీద నుంచి దిగి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంషెడ్‌ పూర్ కు తరలివచ్చిన పంచాయతీ ప్రతినిధులలో కొందరిని కలుసుకొన్నారు. 2013లో పట్నా లో ప్రధాన మంత్రి జన సభ వేళ సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో బాధితులైన వారిలో ఒక బాధితుని భార్య తోను, కుమార్తె తోను ప్రధాన మంత్రి భేటీ అయ్యారు.