Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ ప్రెస్ దినం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి

జాతీయ ప్రెస్ దినం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి

జాతీయ ప్రెస్ దినం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జాతీయ ప్రెస్ దినం సందర్భంగా ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవ సందర్భం కూడాను.

ఈ సందర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి చెప్పారు. పత్రికా రంగం స్వీయ నియంత్రణను పాటించాలని, ఏ విధమైన బాహ్య జోక్యం గాని, లేదా పత్రికారంగంపై నియంత్రణ గాని వాంఛనీయం కాదని స్పష్టంచేశారు.

దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల జరిగిన పత్రికారచయితల హత్యలపై ప్ర‌ధాన మంత్రి ఆందోళన వెలిబుచ్చారు. పత్రికారచయితలు నిజాన్ని చాటిచెప్పేందుకు చేసే పరిశోధనలో వారి ప్రాణాలను కోల్పోవడం అత్యంత గంభీరమైన పరిణామమని ఆయన అన్నారు.

***