Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ సముద్ర తల(ఆఫ్షోర్) పవన ఇంధన విధానానికి ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జాతీయ సముద్ర తల(ఆఫ్షోర్) పవన ఇంధన విధానానికి ఆమోద ముద్ర లభించింది .
ఈ ఆమోదంతో నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ(ఎం.ఎన్.అర్.ఇ) నోడల్ మంత్రిత్వ శాఖగా దేశంలోని ఎక్స్ క్లూసివ్ ఎకనమిక్ జోన్ (ఇ.ఇ.జడ్) పరిధిలోని సముద్ర తీరాన్ని వినియోగించే అధికారమివ్వబడింది మరియు జాతీయ పవన ఇంధన సంస్థ (ఎన్.ఐ.డబ్ల్యు.ఇ) నోడల్ ఏజన్సీగా దేశంలో సముద్ర తల(ఆఫ్షోర్) పవన శక్తిని అభివృద్ధి చేసే, బ్లాక్ లను కేటాయించే మరియు సంబంధిత మంత్రిత్వ శాఖలను, సంస్థలను సమన్వయం చేసే అధికారమివ్వబడింది. దేశంలోని మరియు దేశం చుట్టూ సముద్ర జలాల్లో 200 నాటికాల్ మైల్స్ వరకు (మన దేశ ఎక్స్ క్లూసివ్ ఎకనమిక్ జోన్) సముద్రతల(ఆఫ్షోర్) పవన ఇంధన ప్రాజెక్టులను స్థాపించడానికి, పరిశోధన,అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడానికి తద్వారా పవన శక్తి అభివృద్ధికి మార్గం సుగమం చేయబడింది.

7600 కిలోమీటర్ల భారత తీరరేఖ పొడవున జరిపిన ప్రాథమిక పరిశీలనలో సముద్రతల పవన విద్యుత్ అభివృద్ధికి అవకాశమున్నట్లు తేలింది. జాతీయ సముద్రతల పవన ఇంధన విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, భూతల పవన శక్తి అభివృద్ధిలో సాధించిన ఫలితాలనే సముద్రతల పవన శక్తి అభివృద్ధిలో కూడా పునరావృతం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విధానం దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులు/లబ్దిదారులు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలను జాతీయ పవన ఇంధన సంస్థ పారదర్శకంగా నిర్వహిస్తుంది.

దేశం ఇంధన భద్రతను, ఎన్.ఎ.పి.సి.సి నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశలో దేశం ముందడుగు వేయడానికి పవన ఇంధన అభివృద్ధి దోహదపడుతుంది.
సముద్రతీర పవన లభ్యతను బట్టి ఈ పథకం దేశమంతటికీ వర్తిస్తుంది.

నేపథ్యం :

పెరుగుతున్న ఇంధన అవసరాలను దీర్ఘకాలంపాటు తీర్చగల అత్యంత అభివృద్ధి చెందిన, తక్కువ ధరకు లభ్యమయ్యే నిరూపిత పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానంగా పవన ఇంధనం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. అయితే, సముద్ర తీర పవన విద్యుత్ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే పెద్ద ఎత్తున విస్తరించే స్థితికి చేరి, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల విధానపరమైన మద్ధతుతో శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి పోటీగా నిలుస్తోంది. ఆ స్థాయికి… సముద్ర తల(ఆఫ్షోర్) పవన విద్యుత్ సామర్ధ్యం ఇంకా చేరవలసి ఉంది. సముద్ర తీర పవన విద్యుత్ అభివృద్ధిలో భారత దేశం చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. 23 గిగావాట్ల (జి.డబ్ల్యు)కు పైగా పవన విద్యుత్ సామర్ధ్యాన్ని ఇప్పటికే స్థాపించి ఉత్పత్తి చేస్తోంది.