పిఎంఇండియా
సుబహ్ ఉదేశనక్ వెవా, ఆయుబోవన్
గత సంవత్సరం మార్చి నెలలో నేను జాఫ్నాలో పర్యటించినపుడు ప్రజల నుండి నాకు లభించిన స్వాగత సత్కారాలు ఇవాళ్టికీ నా మదిలో తాజాగానే ఉన్నాయి. నా పర్యటన చరిత్రాత్మకమైనది. ఎందుకంటే జాఫ్నాను సందర్శించిన మొదటి భారతీయ ప్రధానన మంత్రిగా నా పేరు చరిత్రలో నిలిచింది.ఈ రోజు కూడా మరో మరిచిపోలేని రోజు.
శ్రీలంక ప్రజలతో, జాఫ్నా పౌరులతో భారతదేశానికి గల భాగస్వామ్యాన్ని మరొకసారి వేడుకగా స్మరించుకునే సందర్భమిది. ఈ రోజు మనం పునరుద్ధరించిన దురైయప్ప స్టేడియమ్ ను అధ్యక్షుడు శ్రీ సిరిసేనతో కలసి, శ్రీ లంక ప్రజలకు అంకితమిస్తున్నాం.
ఈ సందర్భంలో నేను ఒంటరిని ఏమీ కాను, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన ఆధునిక మార్పుల కారణంగా 125 కోట్ల మంది భారతీయులు, స్నేహశీలురైన శ్రీ లంక ప్రజలు ఈ ఉత్సవంలో పాలుపంచుకొంటున్నారు.
స్నేహితులారా,
దాదాపు 20 సంవత్సరాల తరువాత దురైయప్ప స్టేడియమ్ మీ చప్పట్లతో పునర్ వైభవం పొందుతుంది.
వేల కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఢిల్లీలో కూర్చొనే మేం జాఫ్నాలో జరుగుతున్న మార్పులను, ఆనందోత్సాహాలను ఆస్వాదిస్తున్నాం. దురైయప్ప స్టేడియమ్ కేవలం ఇటుకలు, సిమెంటుతో నిర్మించినది కాదు. ఇది ఆశావాదానికి, ఆర్ధికాభివృద్ధికి చిహ్నంగా నిలుస్తోంది. దురైయప్ప స్టేడియమ్ జాఫ్నా యువత ముందున్న శుభకరమైన ఆరోగ్యకరమైన భవిష్యత్‌కు వేదికగా నిలుస్తోంది. చిరకాలంగా కొనసాగిన హింసను రూపుమాపి, ఆర్ధికాభివృద్ధి పథాన్ని అనుసరించాలనే మీ దృఢమైన నిర్ణయాన్ని ఇది చాటుతోంది. ఈ స్టేడియమ్ పునాదులకు మీ ధైర్యం, త్యాగాలు భరోసాగా నిలిచాయి.
ఈ స్టేడియమ్ పునరుద్ధరణ వేగవంతంగా ముగియడమనేది మీరు మీ గతాన్ని పక్కన పెట్టారనేదానికి నిదర్శనం. మంచి భవిష్యత్ కోసం మీరు పడుతున్న తపనకు ఉదాహరణగా నిలుస్తోంది.
ఎక్స్ లెన్సీ సిరిసేనా,
ఈ ప్రాజెక్టు విజయవంతంగా ముగియడానికిగాను మీరు, ప్రధాని శ్రీ విక్రమ సింఘే, నార్తర్న్ ప్రావిన్స్ గవర్నర్, ముఖ్యమంత్రి దూరదృష్టి గల నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు.
స్నేహితులారా,
ఇరు దేశాల సంబంధాలనేవి ఉభయ దేశాల ప్రభుత్వాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరు దేశాల మధ్యన గల అమూల్యమైన చారిత్రక, సాంస్కృతిక, భాషాపరమైన, కళాత్మకమైన, భౌగోళకపరమైన బంధాలే మన బంధుత్వాలు.
తన ఆర్ధిక ప్రగతి ఇరుగు పొరుగు దేశాలకు కూడా లబ్ధి ని చేకూర్చాలని భారతదేశం బలంగా విశ్వసిస్తోంది.
దురైయప్ప స్టేడియమ్ ఇరు దేశాల సహకార స్ఫూర్తిని చాటుతోంది. నిజం చెప్పాలంటే శ్రీ లంక అభివృద్ధికి భారతదేశ మద్ధతు అనేది ఇరు దేశాల స్నేహాన్ని బలోపేతం చేస్తుంది.
ఈ స్నేహమనేది మీ ప్రాధాన్యాల మీద, అవసరాల మీద ఆధారపడి ఉంటుందనే విశ్వాసాన్ని మీరు తప్పకుండా నమ్మవచ్చు. కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన ఇరు దేశాల బంధాలు వర్తమానంలోను, భవిష్యత్‌లోను ఇరు దేశాలకు సరిపోయేలా ఉండేలా చేసింది ఇదే.
స్నేహితులారా,
ఆర్ధికంగా సౌభాగ్యంతో వెలిగే శ్రీ లంకను చూడాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. ఐకమత్యం, శాంతి, సామరస్యాలు, భద్రత, అందరికీ సమాన అవకాశాలు, ఆత్మగౌరవం లాంటివి దేశమంతా విస్తరించాలి. ప్రజలందరికీ ఈ విలువలు చేరువ కావాలి.
ఎక్స్‌లెన్సీ సిరిసేనా మరియు స్నేహితులారా,
ఇప్పటి నుండి 72 గంటలు గడిచిన తరువాత.. ఈ నెల 21న.. ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినం రెండో వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాం.
2014లో ఈ అంశంపైన ఐక్య రాజ్య సమితి తీర్మానం ముందుకొచ్చినప్పుడు దానికి మద్దతు తెలిపిన ప్రధాన దేశాలలో శ్రీ లంక కూడా ఉంది. అంతర్జాతీయ యోగా దిన ప్రారంభ వేడుకను మనం ఈ రోజు జాఫ్నాలోని దురైయప్ప స్టేడియమ్ నుండే ప్రారంభించుకున్నాం.
కాసేపటికి క్రితం స్టేడియంలో నిర్వహించిన సూర్య నమస్కారమనేది పవిత్రమైన ఆరోగ్యకర భద్రతా సందేశాన్ని ఇచ్చింది. ప్రకృతితో సామరస్యపూర్వకంగా, సుస్థిరంగా నివసించడమనే సందేశాన్ని ఈ ఆసనం ఇస్తోంది.
అంతర్జాతీయ యోగా దిన ప్రారంభ వేడుక విషయంలో ఇంతకంటే మహత్తరమైనది మరొకటి ఉండదు.
ఎక్స్‌లెన్సీ ప్రెసిడెంట్ సిరిసేనా,
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకుగాను మీ తరఫున నిలిచిన నాయకత్వానికి, జాఫ్నా లోని స్నేహశీలురైన పౌరులకు, నేను మరొక సారి అభినందనలు తెలియజేస్తున్నాను. చిరకాలం వెలిగి నిలిచే ఇరు దేశాల స్నేహానికి దురైయప్ప స్టేడియమ్ నిదర్శనంగా నిలుస్తుంది. దేశంలోని ప్రజలందరికీ సౌభాగ్యాన్ని కలిగిస్తూ ప్రగతిని సాధించడానికి కృషి చేస్తున్న శ్రీ లంకతో కలసి భారతదేశం పయనిస్తుంది.
భారతదేశానికి చెందిన 125 కోట్ల మంది ప్రజల తరఫున శ్రీ లంక ప్రజలకు మరొక్కమారు శుభాకాంక్షలు.
బొహోమా స్తుతి, మిక్కా నండ్రి.
అందరికీ ఎన్నెన్నో ధన్యవాదాలు.
Renovated Durraiappah Stadium in Jaffna embodies the spirit of India-SL cooperation & is a symbol of optimism. https://t.co/waGtndsWYk
— Narendra Modi (@narendramodi) June 18, 2016
I salute the visionary leadership of President @MaithripalaS, PM @RW_UNP & CM of Northern Province in ensuring the success of this project.
— Narendra Modi (@narendramodi) June 18, 2016
Also witnessed ‘Surya Namaskar’ being performed in Jaffna, a perfect curtain raiser to #IDY2016 celebrations across the world.
— Narendra Modi (@narendramodi) June 18, 2016