Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జియాలజీ, మైనింగ్, ఖనిజ వనరుల రంగాల్లో సహకారానికి భారత, జింబాబ్వే ప్పందానికి కేబినెట్ ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశంలో 2018 నవంబర్ 3వ తేదీన హరారేలో భారత, జింబాబ్వే మధ్య జియాలజీ, గనులు, ఖనిజ వనరుల విభాగంలో సహకారానికి కుదిరిన ఒప్పందానికి ఆమోదముద్ర  వేసింది.
ప్రధానాంశాలు…  
ఈ దిగువ అంశాల్లో సహకరించుకోవడం ఈ ఒప్పందం లక్ష్యం.
– వనరులు, చట్టాలు, అభివృద్ధి వ్యూహాలపై సమాచార మార్పిడికి సెమినార్ల నిర్వహణ
– సహకారం కోసం అంగీకారానికి వచ్చిన వివిధ సంస్థల మధ్య సాంకేతిక పరిజ్ఞానాల బదిలీ
– విలువ జోడింపునకు ప్రోత్సహించడం
– గనుల రంగంలో పెట్టుబడి అవకాశాల అన్వేషణ
వీటి వల్ల కీలక పత్రాల తయారీ, పంపిణీ తేలికవుతుంది. నవ్యతకు పట్టం కట్టే లక్ష్యం నెరవేరుతుంది.
ప్రయోజనం…
పరస్పర సహకారానికి గుర్తించిన రంగాల్లో భారత, జింబాబ్వే సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు చేసుకునేందుకు ఈ ఒప్పందం దోహదకారి అవుతుంది.

*****