Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జి ఎస్ టి అనేది టీమ్ ఇండియా వేసిన ఒక గొప్ప అడుగు, అది పరివర్తన వైపు వేసిన ఒక గొప్ప అడుగు కూడా : లోక్ సభలో ప్రధాన మంత్రి


వస్తువులు, సేవల పన్ను (జి ఎస్ టి) ని “టీమ్ ఇండియా వేసిన ఒక గొప్ప అడుగు” అని, “పరివర్తన దిశగా తీసుకున్న గొప్ప చర్య” అని, ఇంకా “పారదర్శకత్వం వైపు నకు వేసిన ఒక గొప్ప అడుగు” అని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వర్ణించారు.

ఆయన జి ఎస్ టి బిల్లు పై లోక్ సభ లో చర్చ మధ్యలో జోక్యం చేసుకొంటూ ఈ మాటలన్నారు.

ఈ రోజు ఆగస్టు 8వ తేదీ అని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, 1942 సంవత్సరంలో ఇదే రోజున మహాత్మ గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ రోజు దేశం పన్నుల సంబంధిత ఉగ్రవాదం నుండి విముక్తి దిశగా నడవడం మొదలుపెడుతుందని ఆయన అన్నారు.

త్వరలో పూర్తి కానున్న బిల్లు ఆమోదం అనేది ఏ ఒక్క రాజకీయ పక్షానికో లభించే జయం కాదని, అది భారతీయ ప్రజాస్వామ్యానికే జయమని ఆయన అభివర్ణించారు.

వస్తువులు మరియు సేవల పన్ను పై జరిగిన చర్చలు, సంధి సంభాషణలను ప్రధాన మంత్రి జ్ఞప్తికి తెస్తూ, ఈ అంశంపై చర్చించడానికి శ్రీమతి సోనియా గాంధీని మరియు పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను తాను ఆహ్వానించినట్లు వెల్లడించారు. వారిలో ఒకరు లోక్ సభ ఎమ్ పి అని, మరొకరు రాజ్య సభ ఎమ్ పి అని ఆయన చెప్పారు.

జి ఎస్ టి పై ఏకాభిప్రాయం కుదరడం భారతదేశంలో రాజనీతి కన్నా రాష్ట్రనీతి మిన్న అని నిరూపించిందని ప్రధాన మంత్రి అన్నారు.

రైల్వేలు, అఖిల భారత సేవలు మరియు ‘భారత్ నెట్’.. ఇంకా ‘సాగర్ మాల’ ల వంటి విజన్ ల కోవలోనే జి ఎస్ టి ని ‘ఏక్ భారత్’ యొక్క కంఠహారంలోని మరొక్క ముత్యంగా ప్రధాన మంత్రి వర్ణించారు.

జి ఎస్ టి తో మనం పన్నుల విధానంలో ఏకరూపతను ప్రవేశపెట్టే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. అంతేకాక, కొత్త చట్టం అమలులోకి వస్తే వినియోగదారు సర్వోన్నతుడు అవుతారన్నారు. మనిషి, డబ్బు, యంత్రం, సామగ్రి మరియు నిమిషాలు (కాలం)- వీటిని వివేకవంతంగా వినియోగించుకోవడం అనేది బాగైన ఆర్థిక విధానంలో ఒక ముఖ్యమైన సూత్రం అని, దీనిని సాధించుకోవడంలో జి ఎస్ టి తోడ్పడగలదని ప్రధాన మంత్రి వివరించారు.

జి ఎస్ టి యొక్క శక్తి సాంకేతిక విజ్ఞానంలో ఇమిడివున్న కారణంగా రియల్ టైమ్ డాటా ను అందుకోవడంలోనూ జి ఎస్ టి దోహదం చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. వినియోగదారు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయగల అనేక అంశాలను జి ఎస్ టి పరిధిలో చేర్చలేదు అని ఆయన తెలిపారు. సేకరణ ఖర్చులతో పాటు సేకరణలో అవినీతిని కూడా జి ఎస్ టి తగ్గించగలుగుతుందని ఆయన అన్నారు.

జి ఎస్ టి నుండి చిన్న వ్యాపారాలు సైతం ఎంతగానో లాభపడతాయి, అంతే కాకుండా అవి జి ఎస్ టి తో మరింత ఎక్కువ సురక్షితంగా ఉంటాయి అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

ప్రభుత్వం పేదల ఆర్థిక, విద్యా సాధికారితపైన శ్రద్ధ తీసుకొంటోందని, అలా చేసినందువల్ల పేదరికాన్ని మనం తగ్గించడం సాధ్యమవుతుందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.

****