పిఎంఇండియా
జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున టర్కీ అధ్యక్షుడు శ్రీ రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంలో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, ఆకర్షణీయమైన నగరాల నిర్మాణం అంశాలు ఇరునేతల చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఎగుమతుల నియంత్రణకు సంబంధించిన నాలుగు వ్యవస్థల్లో ఇండియా సభ్యత్వం పొందడానికి వీలుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టర్కీ మద్దతును కోరారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, పౌర అణు సహకారం, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో పరిశోధనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి.
స్పెయిన్ ప్రధాని శ్రీ మేరియానో రజోయ్ తో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారం చర్చకు వచ్చింది. రైల్వేల ఆధునీకరణ, రక్షణరంగ పరికరాల తయారీ, పున: వినియోగ శక్తి, సముద్ర జలాలపైన భద్రత మొదలైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ తో సమావేశమయ్యారు.
Turkish connect...a bilateral meeting with the host of @G20Turkey2015, President @RT_Erdogan. pic.twitter.com/smfvO6oyQd
— PMO India (@PMOIndia) November 16, 2015
Prime Minister Mariano Rajoyof Spain and PM @narendramodi hold talks on the sidelinesof @G20Turkey2015. pic.twitter.com/EUg50OwWs5
— PMO India (@PMOIndia) November 16, 2015