పిఎంఇండియా
జీవసాంకేతిక విజ్ఞాన రంగంలో భారత్-ఫిన్లాండ్ మధ్య పరస్‌ార ఆసక్తి ఆధారిత సహకారంపై అవగాహన ఒప్పందానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విస్తృత పరిశోధన, అభివృద్ధి పరిధిలో ప్రతిష్ఠాత్మక పరిశ్రమరంగ చోదిత వినూత్న, పరివర్తనాత్మక బహుళ జాతీయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, అమలు చేయడం వంటివి ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయి.
ప్రయోజనాలు:
దీర్ఘకాలిక పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణల సహకార యంత్రాంగ సృష్టికి ఈ అవగాహన ఒప్పందం మద్దతిస్తుంది. దీంతోపాటు భారత-ఫిన్లాండ్ సంస్థల నడుమ సహకార నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి బలోపేతం చేస్తుంది. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలుగల అవసర ఆధారిత, ప్రతిష్ఠాత్మక సంయుక్త పథకాలకు నిధులు సమకూర్చడంద్వారా ప్రపంచశ్రేణి ఆవిష్కరణలు లక్ష్యంగా రెండు దేశాలూ పరస్పరం సహయం చేసుకుంటాయి. అలాగే రెండు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల మధ్య పరిజ్ఞాన భాగస్వామ్యంతోపాటు విజ్ఞాన సృష్టిని సులభతరం చేస్తుంది.
వివరాలు:
•
1. ఆవిష్కరణలను సహకారానికి మూలస్తంభాలుగా గుర్తిస్తూ కేంద్ర జీవసాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ (DBT) బిజినెస్, ఫిన్లాండ్ సంయుక్త సహకారానికి ఆమోదం తెలిపాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ DBT పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC)తో సహకరించేందుకు అంగీకారం తెలిపాయి. తదనుగుణంగా ప్రతిష్ఠాత్మక పరిశ్రమరంగ చోదిత వినూత్న, పరివర్తనాత్మక బహుళ జాతీయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, అమలు చేయడం వంటి చర్యలు చేపడతాయి. ఇందులో భాగంగా పరస్పర ఆసక్తి ప్రాతిపదికన పరిశోధనల కోసం i. ఆవిష్కరణ కార్యక్రమం కింద జీవసాంకేతిక భవిష్యత్ వేదిక: జీవ ఇంధనాలు, జీవ శక్తి, జీవద్రవ్య ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి; అలాగే-
•
2. జీవసాంకేతికత సంబంధ పర్యావరణ, ఇంధన అనువర్తనాలు;
3. ప్రారంభ-ప్రగతిశీల కంపెనీల వ్యాపారాభివృద్ధితోపాటు
4. విద్య సంబంధిత సాంకేతికతలు, జీవశాస్త్రాల్లో క్రీడలు vi. జీవశాస్త్ర పరిశ్రమలు, సంబంధిత ఇతర రంగాలు
నేపథ్యం:
హెల్సింకీలో 2008 మార్చి 25న శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహకారంపై ఫిన్లాండ్, భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుత తాజా ఒప్పందంపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి. ఆ మేరకు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన దీర్ఘకాలిక పరిశోధనలు, అభివృద్ధి-ఆవిష్కరణల (R&D & I)లో రెండు దేశాల్లోని సంస్థల నడుమ సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.
**