Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో పీఎం పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు జింద్ రైల్వేస్టేషన్‌లో జింద్-సోనిపట్ మధ్య నడిచే భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు జింద్‌లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు.

అనంతరం ప్రధానమంత్రి చండీగఢ్ వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం సుమారు 1:45 గంటలకు రూ. 6,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తదనంతరం ప్రధానమంత్రి జలంధర్‌ను సందర్శిస్తారు. అక్కడ రూ. 5,470 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

జింద్‌లో పీఎం

హర్యానాలోని జింద్, సోనిపట్‌ మధ్య భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా వ్యవస్థ దిశగా ఇది కీలక ముందడుగు. భారతదేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, ఏకీకృతం చేసిన ఈ రైలును దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. అత్యాధునిక రైల్వే ఇంజనీరింగ్‌లో పెరుగుతున్న దేశీయ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న ఎంపిక చేసిన కొన్ని దేశాల సరసన భారత్ చేరుతుంది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో ఈ రైలు నడుస్తుంది. ఇది హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉప-ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీని వల్ల రైలు నడిచే సమయంలో కర్బన ఉద్గారాలు వెలువడవు.

డీజిల్ రైళ్లతో పోలిస్తే పొగ గొట్టాల ద్వారా వచ్చే ఉద్గారాలను ఇవి పూర్తిగా నివారిస్తాయి. శిలాజ ఇంధనాలు, వాటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. అలాగే చాలా తక్కువ శబ్దంతో నడుస్తాయి. సంప్రదాయ విద్యుత్ రైళ్లతో పోలిస్తే వీటికి నిరంతర ఓవర్‌హెడ్ విద్యుద్దీకరణ మౌలిక సదుపాయాలు అవసరం లేదు. ఇందులోని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా రైలులోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది వీటిని అత్యంత స్వచ్ఛమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా మారుస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ వాడకం వల్ల శిలాజ ఇంధన ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌పై ఆధారపడటం కూడా తగ్గుతుంది. ఇది సుస్థిర రవాణా వ్యవస్థ దిశగా భారత్ సాగించే ప్రయాణానికి దోహదపడుతుంది.

భారతదేశ హైడ్రోజన్ రైలును 10 కోచ్‌లతో రూపొందించారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ఆధారిత ప్రయాణీకుల రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఇది 3,200 హెచ్‌పీ ప్రొపల్షన్‌ వ్యవస్థతో పనిచేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. హర్యానాలో రూ. 12,470 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయటంతో పాటు, శంకుస్థాపనలు చేస్తారు.

సుమారు రూ.9,680 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 157.92 కిలోమీటర్ల పొడవైన, నాలుగు వరుసల, పూర్తి నియంత్రిత ప్రవేశం గల ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీలు 1 నుంచి 5)ను ప్రధానమంత్రి జాతికి అంకితం ఇవ్వనున్నారు. 667 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ఒక భాగం. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఢిల్లీ, కత్రా మధ్య ప్రయాణ సమయం సుమారు 14 గంటల నుంచి దాదాపు 6 గంటలకు తగ్గుతుంది. ఢిల్లీ-అమృత్‌సర్ ప్రయాణ సమయం 8 గంటల నుంచి 4 గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ఎన్‌హెచ్‌-44 (జీటీ రోడ్)పై ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించటమే కాక, శ్రీ మాతా వైష్ణో దేవికి వెళ్లే యాత్రికులు, పర్యాటకుల సంఖ్యను పెంచుతుందని… ఈ కారిడార్ వెంట పారిశ్రామిక, లాజిస్టిక్స్ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.

ఎన్‌హెచ్‌-7, ఎన్‌హెచ్‌-344 లపై ఉన్న 33.81 కిలోమీటర్ల పొడవైన, నాలుగు వరుసల, పాక్షికంగా నియంత్రిత ప్రవేశం గల అంబాలా-కాలా అంబ్ హైవేను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ హైవే అంబాలా పట్టణ ప్రాంతానికి, కాలా అంబ్ పారిశ్రామిక ప్రాంతానికి మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ మధ్య రహదారి మార్గాలను మెరుగుపరుస్తుంది. కొండ ప్రాంతాలకు పర్యాటకుల రాకపోకలను సులభతరం చేస్తుంది. కాలా అంబ్ ప్రాంతంలోని పరిశ్రమల రవాణా ఖర్చులను తగ్గిస్తుంది.

ఎన్‌హెచ్‌-352ఏపై నిర్మించిన 40.60 కిలోమీటర్ల పొడవైన జింద్-గోహనా గ్రీన్‌ఫీల్డ్ హైవే జాతికి అంకితం చేయనున్న మరో ప్రధాన ప్రాజెక్టు. ఈ కొత్త హైవే వల్ల జింద్, గోహనా మధ్య ప్రయాణ సమయం సుమారు రెండు గంటల నుంచి కేవలం 40 నిమిషాలకు తగ్గుతుంది. ఇది ప్రయాణికులకు, సరకు రవాణాకు, వ్యవసాయ పరంగా ఎంతో ప్రాధాన్యత గల జింద్-గోహనా ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. రోహ్‌తక్, పానిపట్, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాలకు అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

దీనితో పాటు 24.27 కిలోమీటర్ల పొడవైన హన్సి-బర్వాలా బ్రౌన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతమున్న రహదారిని పేవ్డ్ షోల్డర్స్ గల 2,4-లైన్ల రహదారిగా ఆధునీకరిస్తారు.

కురుక్షేత్ర నగర పరిధిలోని రైల్వే క్రాసింగుల వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించే ప్రధాన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఎలివేటెడ్ రైల్వే ట్రాక్‌ను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా వాహనాల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. రహదారి భద్రత మెరుగవుతుంది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థల పనితీరు సామర్థ్యం పెరుగుతుంది.

ప్రధాన వైద్య సంస్థలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో భివానీలోని పండిట్ నేకి రామ్ శర్మ ప్రభుత్వ వైద్య కళాశాల, నార్నాల్‌లోని కొరియావాస్ వద్ద ఉన్న మహర్షి చ్యవన్ వైద్య కళాశాల, రావు తులా రామ్ ఆస్పత్రి ఉన్నాయి. ఈ సంస్థలు హర్యానాలో నాణ్యమైన వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచుతాయి. ఆరోగ్య సంరక్షణ నిపుణుల లభ్యతను మెరుగుపరుస్తాయి. ఇళ్ల వద్దే ప్రజలు మెరుగైన వైద్య సేవలను పొందేలా చేస్తాయి. తద్వారా రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఈ ప్రాంత సాంస్కృతిక మౌలిక సదుపాయాలను మరింత సుసంపన్నం చేస్తూ.. కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సిక్కు మత చరిత్ర, సిక్కు గురువుల బోధనలు, వారి ధైర్యసాహసాలు, త్యాగాలు, భారత నాగరికత, సంస్కృతులకు సిక్కు సమాజం అందించిన అమూల్యమైన సహకారాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తారు. 

 

 

చండీగఢ్‌లో ప్రధానమంత్రి

ఆరోగ్య సంరక్షణవిద్యరహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించి రూ. 6,600 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేస్తారు. 

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) లో అధునాతన మాతాశిశు కేంద్రాన్నిన్యూరోసైన్సెస్ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

అధిక ముప్పుతో కూడిన గర్భధారణలుతీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులు,  ప్రత్యేక చికిత్స అవసరమైన పిల్లల కోసం సమగ్ర తృతీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేలా ఈ అధునాతన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని రూపొందించారు.  300  పడకలు  అత్యాధునిక  వైద్య సదుపాయాలతో కూడిన ఈ కేంద్రంమాతాశిశు ఆరోగ్య సంరక్షణ సేవలను గణనీయంగా బలోపేతం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలోని వేలాది కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

అడ్వాన్స్‌డ్ న్యూరోసైన్సెస్ సెంటర్… ఒకే చోట న్యూరాలజీన్యూరోసర్జరీన్యూరో-క్రిటికల్ కేర్ అత్యాధునిక రోగనిర్ధారణ సదుపాయాలతో కూడిన సమగ్ర సేవలను అందిస్తుంది. ఇది సంక్లిష్టమైన నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు సకాలంలో ప్రపంచ స్థాయి చికిత్సను అందించడమే కాకుండాన్యూరోసైన్సెస్‌లో వైద్య పరిశోధనలువిద్యశిక్షణను బలోపేతం చేస్తుంది.

చండీగఢ్‌ పీజీఐఎమ్ఈఆర్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం – ఏబీహెచ్ఐఎం) కింద 150 పడకల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ సదుపాయం అత్యవసర సంసిద్ధతనుతీవ్రమైన సంరక్షణ విస్తృత సేవలనువిపత్తు ప్రతిస్పందన సామర్థ్యాలను గణనీయంగా పెంచడమే కాకుండాఈ ప్రాంతంలోని మొత్తం ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.

చండీగఢ్‌లోని విద్యా సంస్థలకు సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేస్తారు. వీటిలో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో కురుక్షేత్ర బాయ్స్ హాస్టల్,  మెస్సెక్టార్ 46 లోని గవర్నమెంట్ కాలేజీలో హాస్టల్ బ్లాక్ ప్రారంభోత్సవాలుపంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్‌ శంకుస్థాపన ఉన్నాయి. ఈ సదుపాయాలు విద్యాపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకుపరిశోధకులకు నివాస వసతులను మెరుగుపరుస్తాయి. ఉన్నత విద్యకు మెరుగైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పలు ప్రధాన రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేస్తారు. మొహాలీ జిల్లాలోని ఐటీ సిటీ నుంచి కురాలీ వరకు నిర్మించిన 6-లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేను ఆయన ప్రారంభిస్తారుఇది ఈ ప్రాంతానికి అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. ఈ హైవే మొహాలీఖరార్కురాలీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పంజాబ్హర్యానాహిమాచల్ ప్రదేశ్జమ్మూ కాశ్మీర్ మధ్య మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

ప్రధానమంత్రి 6-లేన్ల జిరాక్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ బైపాస్‌కు కూడా శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ జిరాక్‌పూర్-పంచకుల మార్గంలో ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మరింత సులభమైనవేగవంతమైన,  సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. అంబాలా-చండీగఢ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే (ఎన్హెచ్-205 ఏ) పీ ఆర్-7 స్పర్ కు కూడా శంకుస్థాపన చేస్తారు. 10.3 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ సుదూర ప్రాంతాల ట్రాఫిక్ జిరాక్‌పూర్ పట్టణ ప్రాంతాల మీదుగా వెళ్లకుండా నేరుగా జిరాక్‌పూర్ బైపాస్‌ను చండీగఢ్‌లోని ఏరోసిటీకి అనుసంధానించేందుకు వీలు కల్పిస్తుంది.

జలంధర్‌లో ప్రధానమంత్రి కార్యక్రమాలు

ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడంప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం,  ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో కూడిన రూ. 5,470 కోట్ల పైగా విలువైన రైలురహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేస్తారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కిందజలంధర్ కంటోన్మెంట్ తో సహా పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతి

 

 

పెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 20 రాష్ట్రాల వ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం మరో ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. సుమారు రూ. 1,570 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లు ఆధునికప్రయాణికులకు అనుకూలమైన సదుపాయాలుగా మారాయి. వారసత్వంతో పాటు అభివృద్ధి (విరాసత్ భీవికాస్ భీ) స్ఫూర్తితో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతివారసత్వంవాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలను పొందుపరిచారు.

నంగల్ డ్యామ్-తల్వారా-ముకేరియన్ కొత్త రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ. 830 కోట్ల వ్యయంతో నిర్మించిన దౌలత్‌పూర్ చౌక్-కర్తోలి కొత్త రైలు మార్గాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది హోషియార్‌పూర్ఉనా జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తూపంజాబ్హిమాచల్ ప్రదేశ్ మధ్య రైలు అనుసంధానాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుంది. ఈ కొత్త రైలు మార్గం శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్మాతా చింతపూర్ణి ఆలయం వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో పాటుప్రయాణికులకు వేగవంతమైనసురక్షితమైన,  మరింత నమ్మకమైన రవాణా మార్గాన్ని అందించడం ద్వారా మారుమూల ప్రాంతాలకు చేరికను సులభతరం చేస్తుంది.

పంజాబ్హర్యానాహిమాచల్ ప్రదేశ్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే కర్తోలి-అంబాలా రైలు సేవలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన రెండు ఆధ్యాత్మికసాంస్కృతిక కేంద్రాల మధ్య ప్రత్యక్ష రైలు అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తూఅమృత్‌సర్ (ఛహర్తా)-వారణాసి రైలు సేవలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే విధంగా రూ. 3,070 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేస్తారు.

నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వేకి చెందిన 30.9 కిలోమీటర్ల పొడవైన ప్యాకేజీ-6ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ విభాగం ముఖ్యంగా భారీ వాహనాలకు సులభమైనవేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇంధన వినియోగాన్నివాహన నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తుంది.

లూధియానాబటిండా మధ్య ప్రయాణ దూరాన్ని సమయాన్ని తగ్గించడంతో పాటుఇతర ప్రధాన ఆర్థిక కేంద్రాలకు అనుసంధానాన్ని మెరుగుపరిచే 25.2 కిలోమీటర్ల పొడవైనఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ సదరన్ లూధియానా బైపాస్ అభివృద్ధికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

 

***