పిఎంఇండియా
జమ్ము & కశ్మీర్ కు సంబంధించిన బిల్లు లు ఆమోదం పొందడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న స్వాగతించారు. “ఇది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లో ఒక ప్రాముఖ్యం గల సందర్భం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ట్విటర్ లో తన మనోభావాల ను వెల్లడిస్తూ, “మనం అందరమూ ఉన్నతం గా ఆలోచించాలి; 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల ను మనం అందరమూ కలసి నెరవేర్చుదాం” అంటూ ఆశించారు.
“జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల లోని నా సోదరీమణుల కు మరియు సోదరుల కు వారి సాహసాని కి, ఇంకా హుషారు కు నేను ప్రణామం చేస్తున్నాను” అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఇంకా ఇలా అన్నారు.. “సంవత్సరాల తరబడి భావోద్వేగం పేరిట బెదరించి లాక్కోవడాన్నే నమ్ముతూ వచ్చిన్న స్వార్ధపర బృందాలు ఎన్నడూ ప్రజల సాధికారిత పట్ల శ్రద్ధ వహించింది లేదు. జమ్ము & కశ్మీర్ ప్రస్తుతం వారి యొక్క సంకెళ్ల నుండి విడివడింది. ఒక నవోదయం, మెరుగైన రేపటి రోజు లు వేచి ఉన్నాయి”.
శ్రీ నరేంద్ర మోదీ “జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల కు చెందిన బిల్లు లు ఏకీకరణ కు మరియు సాధికారిత కు పూచీ పడతాయి. ఈ చర్య లు యువత ను ప్రధాన స్రవంతి లోకి తీసుకొని వస్తాయి; అలాగే వారి కి వారి యొక్క ప్రతిభ ను, నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు అసంఖ్యాకమైనటువంటి అవకాశాల ను అందిస్తాయి. స్థానిక మౌలిక సదుపాయాలు చెప్పుకోదగ్గ రీతిలో మెరుగు పడుతాయి” అని కూడా అన్నారు.
లద్దాఖ్ ప్రజల కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. “ఒక కేంద్రపాలిత ప్రాంతం గా ప్రకటించాలన్న వారి యొక్క చిరకాల డిమాండు నెరవేరడం గొప్ప సంతోషాన్ని ఇచ్చే అంశం. ఈ నిర్ణయం ఈ ప్రాంత సర్వతోముఖ సమృద్ధి కి ఊతాన్ని ఇవ్వగలుగుతుంది. అంతేకాదు, మెరుగైన అభివృద్ధియుత సదుపాయాలు ఏర్పడేటట్టు చూస్తుంది” అని ఆయన అన్నారు.
“జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ లకు చెందిన బిల్లు లు ఆమోదం పొందడం భారతదేశ ఏకత కు పాటుపడ్డ మహానుభావుడు శ్రీ సర్ దార్ పటేల్ కు, సుపరిచితమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన డాక్టర్ బాబాసాహబ్ ఆంబేడ్కర్ కు, భారతదేశం యొక్క ఏకత కు, సమగ్రత కు జీవితాన్ని సమర్పించిన డాక్టర్ ఎస్.పి. ముఖర్జీ కి సముచిత నివాళులు గా ఉన్నాయి” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
“పార్లమెంట్ లో, రాజకీయ పక్షాలు సమయోచితం గా ప్రతిస్పందించి, సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల ను అధిగమించి, మరి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అతిశయం ఇనుమడింపచేసిన ఒక చక్కని చర్చ లో భాగం పంచుకున్నాయి. దీని కి గాను వివిధ రాజకీయ పక్షాల ను, వాటి నాయకుల ను మరియు ఎంపీ లందరి ని నేను అభినందిస్తున్నాను” అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ట్విటర్ లో వ్రాసిన ఒక ప్రత్యేక సందేశం లో “జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ఎంపీ లు అభిప్రాయ భేదాల ను అధిగమించి, ఈ ప్రాంతాల భవిష్యత్తు ను గురించి వాదోపవాదాలు చేయడం తో పాటు ఈ ప్రాంతాల లో శాంతి కి, పురోగతి కి మరియు సమృద్ధి కి అనువైన వాతావరణం ఏర్పడేటట్టు చేసినందుకు వారి ని చూసుకొని జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ప్రజలు గర్వపడతారు. రాజ్య సభ లో 125:61 మరియు లోక్ సభ లో 370:70.. ఈ తుది సంఖ్య ల ద్వారా విస్తృతమైనటువంటి మద్ధతు ను స్పష్టం గా చూడవచ్చును” అని ఆయన వివరించారు.
“భారతదేశ ఉప రాష్ట్రపతి మరియు రాజ్య సభ చైర్మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు, మరి అలాగే స్పీకర్ శ్రీ ఓం బిర్లా కోటా గారు లు ఉభయ సభల లో కార్యకలాపాల ను ఒక శ్రేష్ఠమైన పద్ధతి లో నిర్వహించారు. దీనికి గాను వారు యావత్తు దేశ ప్రజల ప్రశంస లకు పాత్రులు” అని ఆయన అన్నారు.
ఆయన హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ ను ప్రత్యేకం గా అభినందించారు. “జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ప్రజల కు ఒక ఉత్తమమైన జీవనం లభించే దిశ గా మన హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ గారు నిరంతరం శ్రమించారు. ఆయన నిబద్ధత, ఇంకా తత్పరత లు ఈ బిల్లుల ఆమోదం లో స్పష్టం గా కనిపిస్తున్నాయి. నేను అమిత్ భాయ్ ని ప్రత్యేకం గా అభినందించదలచుకొన్నాను’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ऐतिहासिक क्षण। एकता और अखंडता के लिए सारा देश एकजुट। जय हिंद!
— Narendra Modi (@narendramodi) August 6, 2019
हमारे संसदीय लोकतंत्र के लिए यह एक गौरव का क्षण है, जहां जम्मू-कश्मीर से जुड़े ऐतिहासिक बिल भारी समर्थन से पारित किए गए हैं।
मैं जम्मू-कश्मीर की बहनों और भाइयों के साहस और जज्बे को सलाम करता हूं। वर्षों तक कुछ स्वार्थी तत्वों ने इमोशनल ब्लैकमेलिंग का काम किया, लोगों को गुमराह किया और विकास की अनदेखी की। जम्मू-कश्मीर और लद्दाख अब ऐसे लोगों के चंगुल से आजाद है। एक नई सुबह, एक बेहतर कल के लिए तैयार है!
— Narendra Modi (@narendramodi) August 6, 2019
ये कदम जम्मू-कश्मीर और लद्दाख के युवाओं को मुख्यधारा में लाएंगे, साथ ही उन्हें उनके कौशल और प्रतिभा को प्रदर्शित करने के अनगिनत अवसर प्रदान करेंगे। इससे वहां के इन्फ्रास्ट्रक्चर में सुधार होगा, व्यापार-उद्योग को बढ़ावा मिलेगा, रोजगार के नए अवसर बनेंगे और आपसी दूरियां मिटेंगी।
— Narendra Modi (@narendramodi) August 6, 2019
लद्दाख के लोगों को विशेष रूप से बधाई! मुझे इस बात की बेहद खुशी है कि केंद्र शासित प्रदेश घोषित करने की उनकी दशकों पुरानी मांग आज पूरी हो गई है। इस फैसले से लद्दाख के विकास को अभूतपूर्व बल मिलेगा। लोगों के जीवन में समृद्धि और खुशहाली आएगी।
— Narendra Modi (@narendramodi) August 6, 2019
इन विधेयकों का पारित होना देश के कई महान नेताओं को सच्ची श्रद्धांजलि है: सरदार पटेल, जो देश की एकता के लिए समर्पित थे; बाबासाहेब अम्बेडकर, जिनके विचार सर्वविदित हैं; डॉ. श्यामा प्रसाद मुखर्जी, जिन्होंने भारत की एकता और अखंडता के लिए अपना जीवन समर्पित कर दिया।
— Narendra Modi (@narendramodi) August 6, 2019
संसद में जिस प्रकार विभिन्न पार्टियों ने दलगत राजनीति से ऊपर उठकर और वैचारिक मतभेदों को भुलाकर सार्थक चर्चा की, उसने हमारे संसदीय लोकतंत्र की गरिमा को बढ़ाने का काम किया है। इसके लिए मैं सभी सांसदों, राजनीतिक दलों और उनके नेताओं को बधाई देता हूं।
— Narendra Modi (@narendramodi) August 6, 2019
जम्मू-कश्मीर और लद्दाख के लोगों को गर्व होगा कि सांसदों ने वैचारिक मतभेदों को भुलाकर उनके भविष्य को लेकर चर्चा की। साथ ही साथ वहां शांति, प्रगति और समृद्धि की राह सुनिश्चित की। RS में 125:61 और LS में 370:70 का विशाल बहुमत इस फैसले के प्रति भारी समर्थन को दिखाता है।
— Narendra Modi (@narendramodi) August 6, 2019