పిఎంఇండియా
మాతృమూర్తులు, సోదరీమణులు, సోదరులు మరియు ఇక్కడకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నా యువ మిత్రులారా,
ఈ రోజు మార్చి నెల 8వ తేదీ. ఒక వంద సంవత్సరాలకు పైగా యావత్తు ప్రపంచం ఈ రోజు ను ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’గా పాటిస్తూ వస్తోంది. అయితే, ఈ రోజు యావత్తు దేశం ఝుంఝునూ తో జోడించబడింది. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం యొక్క భవ్యమైనటువంటి సన్నివేశం సాంకేతిక విజ్ఞానం యొక్క తోడ్పాటు తో దేశం లోని ప్రతి మూలకు చేరుతోంది. నేను ఇక్కడకు ఊరకనే రాలేదు; బాగా విశ్లేషణ చేసిన తరువాతే వచ్చాను. వాస్తవానికి, నన్ను ఇక్కడకు తీసుకు వచ్చింది మీరే. మీరు ఇక్కడకు నేను తప్పనిసరిగా వచ్చేటట్టు చేశారు. దీనికి కారణం ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచారాన్ని ముందుకు తీసుకు పోవడంలో అభినందనీయమైన కార్యం ఈ జిల్లా లో చోటు చేసుకోవడమే. ఈ జిల్లా లోని ప్రతి ఒక్క కుటుంబం ప్రశంసించదగ్గ కార్యాన్ని చేపట్టింది. ఝుంఝునూ గడ్డను సందర్శించాలన్న కోరిక స్వాభావికంగానే నాలో జనించింది.
ఈ నేల కథానాయకుల నేల అని వసుంధర గారు కాసేపటి క్రితం పేర్కొన్నారు. ఈ నేల యొక్క శక్తిని గురించి ఆమె ప్రస్తావించ సాగారు. సామాజిక సేవ, విద్య, దాతృత్వం లేదా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడం.. ఇలాగ ప్రతి రంగంలోనూ ఝుంఝునూ తన శ్రేష్ఠత్వాన్ని నిరూపించుకొంది. అది పరాజయాన్ని ఎన్నటికీ స్వీకరించనే లేదు. దుర్భిక్షం కావచ్చు, లేదా పోరాటం కావచ్చు- ఎలా ముందుకు పోవాలో దీనికి తెలుసును. ఈ కారణంగా ఝుంఝునూ లో కొనసాగుతున్న పని నుండి దేశం ఒక కొత్త శక్తిని మరియు ప్రేరణను పొందనుంది.
‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమం యొక్క విజయం పరిస్థితిలో మెరుగుదల ఉందన్న విషయాన్ని నిరూపించి అలా ఒక తృప్తి ని మిగుల్చుతోంది. అయితే, గొప్ప ఇతిహాసాలు, సంస్కృతి, ఇంకా వివేకానందుల వారి వంటి మహనీయులకు పేరెన్నిక గన్న భారతదేశం వంటి దేశంలో, ఆడ శిశువును కాపాడడం కోసమని మనం పదే పదే అభ్యర్థించితీరాల్సిన, కొన్ని పథకాలకు బడ్జెట్ లో నిధులను కేటాయించాల్సిన మరియు అలాంటి పథకాలను ప్రజలు అర్థం చేసుకొనేటట్టు చూడాల్సిన పరిస్థితులు నెలకొనడం ఒక్కొక్క సారి మనస్సు ను గాయపరుస్తూ ఉంటుంది. ఇంత లోతుగా వేళ్ళూనుకొన్న సామాజిక చెడుకు కారణం ఏమిటి ?
మరే సమాజానికీ కూడాను ఇంతకన్నా తీవ్రతరమైన వేదన ఉండదేమో అని నేననుకొంటున్నాను. పలు దశాబ్దాలుగా మనం మన పుత్రికలను కేవలం ఈ సామాజిక చెడు మరియు తప్పుడు మనస్తత్వం కారణంగా విడచిపెట్టడమో, లేదా వారిని త్యాగం చేయడమో.. వీటిలో ఏదో ఒక దానిని ఎంచుకొన్నాం. ప్రతి వేయి మంది బాలురకు గాను బాలికల సంఖ్య 800, 850, లేదా 900 గా ఉంటోందని మనం వింటున్నప్పుడల్లా పరిస్థితి ఎంత దిగజారిందీ మీరు ఇట్టే ఊహించగలరు. పురుషులు మరియు మహిళల మధ్య ఒక సమతుల్యం ఉన్నప్పుడే సమాజం మనగలుగుతుంది.
అనేక దశాబ్దాల తరబడి ఆడపిల్ల ను హతమార్చడమనేది, సమాజంలో ఒక అసమతౌల్యానికి దారి తీసింది. నాలుగు- అయిదు తరాల అన్యాయాలు ప్రస్తుతం పోగు పడ్డాయి. మునుపటి నష్టాలు భర్తీ కావాలంటే అందుకు సమయం పడుతుంది. ఏమైనప్పటికీ బాలుర సంఖ్యతో సమానంగా బాలికల సంఖ్య ఉండేటట్లు చర్యలను తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు బాలురు మరియు బాలికలు సమాన సంఖ్యలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. బాలురు మరియు బాలికల సమానత్వం అనే భావనతో మనం ముందుకు సాగితే గత నాలుగు-అయిదు తరాల తరబడి జరిగిన తప్పు లను రానున్న రెండు మూడు తరాల లోపల సరిదిద్ద గలుగుతాం. అయితే, దీనికి ఒక షరతు ఉంది. అది.. ఇక మీదట జన్మించే బాలురు మరియు బాలికల సంఖ్యలో ఒక అసమతౌల్యాన్ని మనం సృష్టించనే కూడదు.. అన్నదే.
ఈ కార్య భారాన్ని ఎంతో చక్కగా నెరవేర్చిన పది జిల్లాలను ఈ రోజు సమ్మానించుకొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ జిల్లాలు బాలికల జననాల సంఖ్యను బాలుర సంఖ్యతో సమానంగా ఉండేటట్లు చూడడంలో సఫలం అయ్యాయి. ఈ పవిత్రమైన కార్యాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకు తీసుకుపోవడంలో కృషి చేసిన, అవార్డులను గెలుచుకొన్న రాష్ట్రాలను, జిల్లాలను మరియు ఈ దిశగా పని చేసిన యావత్తు బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
అంతేకాకుండా దీనిని ఒక సామూహిక ఉద్యమంగా మలచవలసిందిగా నేను మన దేశంలోని ప్రభుత్వ అధికారులను, ఇతర విభాగాల అధికారులను మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. ప్రతి ఒక్క కుటుంబం కలవనిదే, అత్తల స్థానంలో ఉన్న వారు నాయకత్వం వహించనిదే ఈ కార్య భారం పురోగతిని నమోదు చేయదు. అత్త గారు నేతృత్వం వహించి తక్షణం ఇంట్లో ఒక పుత్రిక ఉండాలంటూ ఒకసారి స్పష్టం చేశారంటే గనక, ఈ ప్రపంచం లోని మరెవ్వరూ ఆ కుమార్తె కు అన్యాయాన్ని చేయజాలరు. కనుక, మనం ఒక సామాజిక ఉద్యమాన్ని మరి ఒక సామూహిక ఉద్యమాన్ని నిర్మించవలసి వుంది.
ఈ సవాలును భారత ప్రభుత్వం స్వీకరించి హరియాణా లో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. రెండు సంవత్సరాల క్రితం అక్కడి పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉండేది. దానిని గురించి హరియాణాలో వివరించడం సైతం కష్టమే. వారు అక్కడకు వెళ్లి వుంటే గనక పరిస్థితి మరింతగా దిగజారగలదన్న సంగతిని నా చెవిన అధికారులు వేశారు. అత్యంత దయనీయమైన చోటు నుండే నేను నా ప్రయాణాన్ని ప్రారంభిస్తానన్నాను. ఈ రోజు నేను హరియాణాను అభినందిస్తున్నాను. వారు రెండు సంవత్సరాల లోపల పరిస్థితిని అమిత వేగంగా మెరుగుపరచారు. బాలికల జననాల సంఖ్యలో నమోదైన పెరుగుదల ఒక కొత్త నమ్మకంతో పాటు ఒక కొత్త ఆశను రేకెత్తించింది. మరి ఈ సాఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు.. భారత ప్రభుత్వం ఈ పథకాన్ని దేశంలో 160-161 జిల్లాల నుండి మొత్తం జిల్లాలకు విస్తరించింది. ఇది పరిస్థితిని బాగు చేయగలదు. కానీ మనం ఈ స్థితిని మరింతగా సరిదిద్దడంపైన కూడా శ్రద్ధ వహించవలసి వుంది. ఈ దిశ గానే మేం కృషి చేస్తున్నాం.
పుత్రికలను భారంగా పరిగణించిన సందర్భాలు కొన్ని తరాల తరబడి కొనసాగడం చెల్లుబాటు అయ్యేదేనా అంటూ మనను మనమే ప్రశ్నించుకోవాల్సివుంది. ప్రస్తుత అనుభవాలు మరియు సంఘటనలు పుత్రికలు ఒక భారమేమీ కాదని, వారు పరివారానికంతటికీ గర్వ కారణమన్న సంగతిని మనకు చెబుతున్నాయి.
భారతదేశంలో మనం ఒక ఉపగ్రహ ప్రయోగం లేదా మంగళ్‌యాన్ అభియాన్ ల వంటి సాఫల్యాలను గురించి తెలుసుకొన్నప్పుడు, ఆ తరహా ఘన కార్యాలలో ముగ్గురు మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకొంటున్నాం. ఇదీ మన పుత్రికలకు ఉన్నటువంటి శక్తి. ఝుంఝునూ నుండి ఒక మహిళా ఫైటర్ పైలట్ ఎదిగి వచ్చారంటే మన పుత్రికల శక్తి ఎంతటిదో మనం గ్రహిస్తాం. మన పుత్రికలు స్వర్ణ పతకాలను లేదా ఆ మాటకు వస్తే ఒలంపిక్స్ లో ఏదైనా పతకాన్ని చేజిక్కించుకొన్నప్పుడల్లా వారిని చూసుకొని దేశం గర్వపడుతూ ఉంటుంది.
కొంత మంది అనుకొంటూ ఉంటారు.. అబ్బాయి వారి వృద్ధాప్య కాలంలో తోడుగా ఉంటాడూ అని. అయితే, ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. నలుగురు కుమారులు.. వారిలో ప్రతి ఒక్కరికీ వారి సొంత బంగళా, ఫ్యాన్సీ కార్లు ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులు తమ వార్ధక్యాన్ని వృద్ధాశ్రమాలలో గడుపుతూ ఉన్నటువంటి పరివారాలను నేను చూశాను. మరో పక్క, తన తల్లితండ్రులను సంరక్షిస్తున్నటువంటి, కఠిన శ్రమకు ఓర్చి తన తల్లితండ్రుల కోసం ఆర్జిస్తున్నటువంటి ఏకైక పుత్రిక కల కుటుంబాలను సైతం నేను గమనించాను. ఆమె తన తల్లితండ్రుల రక్షణ కోసం, వారు అవస్థల పాలు కాకుండా చూడటం కోసం తరచు ఆమె అవివాహితగా మిగిలిపోతోంది కూడాను.
ఈ కారణంగా వక్రీకరించిన ఆలోచన దృక్పథం బారి నుండి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ సామాజిక ఉద్యమం మన అందరి బాధ్యత. ఈ పథకం యొక్క వైఫల్యానికి గాను నిందను ప్రభుత్వం మీద కొంత మంది వేయవచ్చు. అది మంచిదే. ఆ ప్రకారంగా, దీని విజయం ప్రతి పరివారం యొక్క దృఢ సంకల్పపు సాఫల్యం మీద ఆధారపడుతుంది. మనం మన కుమారులను మరియు కుమార్తెలను సమానంగా పరిగణించనిదే, కుమార్తెలు వారి మాతృమూర్తుల ఒడి లోనే హతమవుతూ ఉంటారు.
18వ శతాబ్దంలో ఒక వ్యవస్థ ఉండేది.. ఇందులో పుత్రికలను పాలతో నిండిన ఒక పెద్ద పాత్రలో ముంచివేసే వారు. అయితే, 21వ శతాబ్దం లోనూ మనం 18వ శతాబ్దం నాటి ప్రజల కన్నా ఘోరంగా వ్యవహరిస్తున్నాం అని నేను అనుకొంటున్నాను. దీనికి కారణం 18వ శతాబ్దంలో కనీసం ఆ ఆడ శిశువు జన్మ దశ ను అధిగమించేది. తన తల్లి ముఖాన్ని చూసే అదృష్టంతో పాటు ఈ భూమి మద కొంత సేపు ఊపిరి ని పీల్చే అదృష్టం తనకు ఉండేది. ఆ తరువాత, ఆమె తీవ్రాతి తీవ్రమైన సామాజిక నేరానికి బాధితురాలు అయ్యేది.
కానీ, ఈ రోజున నేరం మరింత అధ్వానంగా మారిపోయింది. ఆమె తల్లి గర్భంలో ఉండగానే హతమార్చబడుతోంది. పుత్రిక ముఖాన్ని తల్లి గానీ , తల్లి ముఖాన్ని పుత్రిక గానీ చూడడమే లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పుత్రిక ను తల్లి యొక్క గర్భ కోశం లోపలే చంపివేస్తున్నారు. ఇంత కన్నా అతి హీనమైన నేరం ప్రపంచంలో మరొకటి లేదని నేను నమ్ముతున్నాను. పుత్రికలను మన గర్వ కారణంగా మనం భావించనిదే, ఈ సామాజిక చెడును మనం నిర్మూలించలేము.
ఈ రోజు పుత్రికలకు జన్మనిచ్చిన మాతృమూర్తులను మరియు కుటుంబ సభ్యులను కలుసుకొనే అవకాశం నాకు దక్కింది. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు! పుత్రికలు జన్మించిన వేళ మిఠాయిలను వారు పంచిపెట్టిన సంగతి మీకు తెలుసా ? అని వారిని నేను అడిగాను. ఆ సంగతి తమకు తెలియదని, కానీ వారికి పుత్రికలు పుట్టినప్పుడు వారు తాము నివసిస్తున్న ప్రాంతం అంతటా స్వయంగా మిఠాయిలను పంచిపెట్టి ఈ సందర్భాన్ని వేడుక గా జరుపుకొన్నట్టు నాతో చెప్పారు.
ఈ పరిస్థితిని మార్చవలసిన అవసరం ఉంది; ఈ దిశగా ఈ పథకాన్ని యావద్దేశానికీ విస్తరించడం ద్వారా ప్రభుత్వం కృషిని సాగిస్తోంది.
ఈ రోజున మనం మరొక పథకాన్ని కూడా ప్రారంభించుకొంటున్నాం. దాని పేరే ‘రాష్ట్రీయ పోషణ్ అభియాన్’. మీరు ప్రధాన మంత్రిని విమర్శించాలనుకొన్నప్పుడల్లా లేదా ప్రధాన మంత్రి ని గురించి ఫిర్యాదు చేయాలనుకొన్నప్పుడు మీ మనస్సు లోకి ప్రధాన మంత్రి అన్న మాట వచ్చిందంటే కనుక మీరు పోషణ్ మిశన్ ను గురించి తప్ప నరేంద్ర మోదీ ని గురించి ఆలోచించకూడదు. ఇది ప్రతి ఇంటికీ చేరుకొనే తీరును మీరు చూస్తారు.
కొన్ని కొన్ని సందర్భాలలో ఒక శిశువు యొక్క శరీరం.. అది అబ్బాయి గానీ లేదా అమ్మాయి గానీ.. ఎదగడమనే ప్రక్రియ ఆగిపోతుంది. ఒక్కొక్క సారి పుట్టిన శిశువుల బరువు ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో అవగాహన లేమి ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ సమస్య నుండి మనం బయటపడాల్సివుంది. ఇది కేవలం ప్రభుత్వం యొక్క పని కాదు అని మీకు నేను మరొక్కమారు స్పష్టం చేయదలచుకొన్నాను. ఇది ఒక సామూహిక ఉద్యమంగా మారిన ట్లయితే మరియు ప్రజలకు చైతన్యాన్ని మప్పి, వారికి నేర్పిస్తే అదుగో అప్పుడు పరిస్థితులు మారుతాయి.
పోషకాహార లేమి పైన పోరాటాన్ని జరిపే కృషిని చేయడం ఇదే మొట్టమొదటి సారి కాదు. ప్రతి ప్రభుత్వం ఏదో ఒక పథకంతో ముందుకు వచ్చింది. ఏమైనప్పటికీ సరైన రీతిలో కేలరిలు మరియు తగిన భోజనం అందించామంటే చాలు పోషకాహార లేమితో పోరాటం సాధ్యమని చాలా మంది భావిస్తూ ఉన్నట్లు గమనించడం జరిగింది. కానీ, యావత్తు ఇకో సిస్టమ్ ను చక్కదిద్దవలసి ఉంటుందని అనుభవాలు సూచిస్తున్నాయి. నీరు నాసిరకమైందయితే, అటువంటప్పుడు అవసరమైన పోషణ అందనే అందదు.
పోషకాహార లోపానికి గల కారణాలలో బాల్య వివాహం అనేది ఒక కారణమన్న సంగతిని చాలా తక్కువ మంది మాత్రమే ఎరుగుదురు. శరీరం సరిగా ఎదగని చిన్న వయస్సు లో పెళ్ళాడడం, కాన్పు పోషకత్వ లోపానికి మరియు అప్పుడే పుట్టిన బిడ్డ శరీరం సరిగ్గా ఎదగక పోవడానికి దారి తీస్తాయి. అందుకని మనం జీవితం లోని ప్రతి దశ లోను సరైన సమయానికి సరైన పనిని చేయడంతో పాటు జబ్బు పడ్డప్పుడు తగిన మందులును కూడా వేసుకోవాలి. అలాగే, బిడ్డ పుట్టిన వెనువెంటనే ఆ బిడ్డ కు తల్లి పాలు అందించాలి. అయితే, శిశువు జన్మించగానే తల్లి పాలు ఇవ్వకూడదు అనే ఒక అపార్థం కూడా ఉంది. ఇదే మనం చేసే తప్పు. శిశువుకు పుట్టిన వెంటనే తల్లి పాలను అందించడం జరిగితే ఆ శిశువుకు శరీరం సరిగ్గా ఎదగడానికి తగినటువంటి పౌష్టికాహారం సమకూరుతుంది. అంతేకాదు, ఆ తరువాతి జీవితంలోనూ శిశువు కు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవ్వవు. తల్లి పాల లోని బలం ఇది. కానీ, మనం ఈ విషయాన్ని గంభీరంగా తీసుకోవడం లేదు. ఈ కారణంగా మనం తల్లి పాల లోని గొప్పతనాన్ని అర్థం చేసుకొని, ఆమెను పూజించి, ఆమెను సంరక్షించిన పక్షంలో ఆమె ఒడి లోని బిడ్డ కూడా పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఉంటుంది.
పోషకాహారం అనేది కేవలం ఒక అంశమే. ఒక్కొక్క సారి ప్రభుత్వం టీకాల కార్యక్రమాన్ని నడుపుతూ ఉంటుంది. కానీ, ఆరోగ్య కేంద్రాలు సమకూర్చే సదుపాయాలను మనం ఉపయోగించుకోం. ఇందుకోసం మాకు ఒక నిర్దిష్ట బడ్జెటు, అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు. దీనిని పట్టించుకోకపోవడం వల్ల, ప్రజలు ఏదో ఒక వ్యాధి పాలబడుతున్నారు.
మనం చూసిన చిత్రాన్ని బట్టి- భోజన సమయాని కన్నా ముందు చేతులను శుభ్ర పరచుకోకపోవడం అనే అనారోగ్యకర అభ్యాసం వల్ల 30 నుండి 40 శాతం మంది చిన్న పిల్లలకు వ్యాధులు సోకుతూ మరి వారు చనిపోతున్నట్లు మనకు అర్థం అయింది. పిల్లలకు అన్నం పెట్టే ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలని తల్లులకు బోధించడాన్ని ఓ అలవాటుగా మార్చుకొనేది ఎవరు ? కొన్ని సందర్భాలలో పిల్లవాడు తన నోట్లో దేనినో పెట్టేసుకొంటాడు. పిల్లల చేతులను కూడా శుభ్రం చేయాలని వారికి ఎవరు చెప్తారు ?.
ఇది మన పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం చేయవలసిన పని. మన పిల్లల జీవితాలను బాగు చేయాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అందువల్ల మేం జల సంబంధిత అంశాలు, మందులు, ఇతరత్రా అనేక పథకాలను ఒక చోట చేర్చి ఉద్యమ రూపంలో ఈ పథకాన్ని అమలు పరుస్తున్నాం. కొంత వయస్సు వచ్చాక ఎప్పుడైతే బాలలు బడికి వెళతారో వారిలో ఒక న్యూనత భావం చోటు చేసుకోవడాన్ని మనం చూసే ఉంటాం. దీనికి కారణం ఏమిటి ? బడిలో అయిదుగురు పొడవైన పిల్లలు ఉండి, మిగిలిన వారు పొట్టిగా ఉండి వుండవచ్చు. పొట్టిగా ఉన్న బాలలు తాము కూడా పొడవుగా ఉన్న ఆ అయిదుగురు పిల్లలంత ఎత్తున ఉండాలి అని కోరుకొంటారు. వారిని ఇదే ఆలోచన వేధిస్తూ వుంటుంది. మీరందరూ మీ ఎత్తును పెంచుకోవడం కోసం చెట్టు కొమ్మలను పట్టుకొని ఊగే ప్రయత్నాలు చేసి ఉండే వుంటారు. అయితే, ఇటువంటి విషయాల్లో శాస్త్రీయ పద్ధతి లో మనం ఎన్నటికీ కసరత్తులు చేయం.
ప్రస్తుతం ప్రతి వయో వర్గానికి ఫలానా ఎత్తు అంటూ నిర్దేశింపబడి వుంది. కానీ ఈ విషయంలో మన దేశం చాలా వెనుకబడిపోయింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యే 2022 వ సంవత్సరానికల్లా మన పిల్లలు ఆరోగ్యవంతులుగా, సరైన ఒడ్డు, సరైన పొడవు కలిగిన వారుగా ఉండేటట్లు మనం పాటుపడి తీరాలి. తద్వారా, పోషకాహారం రంగంలో మేం దీనిని సాధించాం అంటూ ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పగలం. ఎటు చూసినా ప్రఫుల్లంగా ఉండే మన పిల్లలను మనం చూడగలిగే ఒక దృశ్య వివరణను మనం ఆవిష్కరించవలసివుంది.
ఈ పథకం కోసం మేము దాదాపు 9000 కోట్ల రూపాయలను కేటాయించాం. నిర్ణీత ప్రమాణాలు, ఆశా శ్రామికులు, గ్రామ స్థాయిలో స్వచ్ఛంద సేవకులు.. వీరికి సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన ఉంటుంది.. సిద్ధంగా ఉంటారు. వారు క్రమం తప్పక సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారంలో ఏవైనా మార్పులు కనపడితే వెంటనే ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొంటారు. సమస్యలను నిశితంగా విశ్లేషించి, పరిష్కారాల కోసం మేం అన్వేషిస్తాం. ఒక్కొక్క సారి 8 నెలల పాటు ఏ బాలుడి వృద్ధి అయినా బాగానే ఉన్నప్పటికీ, ఆ తరువాత ఆకస్మికంగా అతడు లేక ఆమె వానా కాలం కారణంగా జబ్బు పడితే అటువంటప్పుడు అంత క్రితం 8 నెలల్లో నమోదైన వృద్ధి తో ఉపయోగం ఉండదు. కావున ఇది ఒక సవాలుతో కూడినటువంటి కార్యమన్నమాట. కానీ, మనం సవాలు నిండిన ఈ పనిని నెరవేర్చాల్సివుంది. మన తీర్మానాలను మనం సాకారం చేసుకోగలుగుతామని నేను నమ్ముతున్నాను. ‘ఇంద్రధనుష్ అభియాన్’ లో భాగంగా చేపట్టే పనులను వేగవంతం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆఖరు కల్లా 90 శాతం టీకాలు వేయడాన్ని సాధించాలని మేము ప్రయత్నిస్తున్నాం. ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’లో భాగంగా ప్రభుత్వం ప్రతి ఒక్క గర్భవతికి 6000 రూపాయలను ఇస్తోంది. మరి ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ లో భాగంగా సుమారు 23 లక్షల మంది మహిళలు ఈ ప్రయోజనాన్ని అందుకొన్నారు.
ఇదే తీరులో, తల్లులు వారి ఇళ్ళలో వంట చెరకు ను మండిస్తున్నప్పుడు రోజుకు 400 సిగరెట్ల పొగకు సమానమైన పొగను పీల్చక తప్పని స్థితికి లోనవుతున్నారు. ఈ సమస్యను నివారించడం కోసం మేము ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’లో భాగంగా గ్యాస్ కనెక్షన్ లను ఉచితంగా సమకూర్చడం మొదలుపెట్టాం. ఇవాళ దాదాపు మూడున్నర కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లను అందించడమైంది. ఈ ప్రయాణాన్ని రానున్న రోజులలో ముందుకు తీసుకు పోవడం ద్వారా మన దేశాన్ని ఆరోగ్యవంతమైందిగా మనం తీర్చిదిద్దుకోవాల్సివుంది. ఈ రోజు ప్రారంభించిన ఈ పథకాలను మనం ముందుకు తీసుకు పోవాలి. మన పిల్లలకు సాధికారిత ను ప్రసాదిస్తే మన దేశం తనంతట తాను సాధికారిత ను సంపాదించుకొంటుంది.
ఈ సంకల్పంతో ఈ ఉద్యమంలో చేరవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక మానత్వంతో కూడిన కార్యమని, భావి తరాల కోసం చేపట్టిన కార్యక్రమమని, మరియు ఇది భారతదేశ భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం అని నా దేశవాసులకు నేను పిలుపునిస్తున్నాను. దయచేసి మాతో చేరండి.
ఇక ఇప్పుడు నాతో కలిసి ఈ మాటలను బిగ్గరగా పలకండి :
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
అనేకానేక ధన్యవాదాలు.
****
With the power of technology the entire nation is connected with Jhunjhunu.
— PMO India (@PMOIndia) March 8, 2018
I am here in Jhunjhunu to commend this district for furthering the #BetiBachaoBetiPadhao movement: PM @narendramodi https://t.co/GV4fRhII6B #NariShakti4NewIndia
There is no question of discrimination based on gender. Everyone is equal: PM @narendramodi in Rajasthan #NariShakti4NewIndia
— PMO India (@PMOIndia) March 8, 2018
Important that girls get access to quality education, just like boys do: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 8, 2018
'बेटा-बेटी एक' भाव के लिए हमें एक सामाजिक और जन आंदोलन खड़ा करने की जरूरत : PM @narendramodi
— PMO India (@PMOIndia) March 8, 2018
A daughter is not a burden.
— PMO India (@PMOIndia) March 8, 2018
Please look around us- see how girls are bringing pride and glory for our nation. They are excelling in several fields: PM @narendramodi #NariShakti4NewIndia
बेटी बोझ नहीं, बेटी पूरे परिवार की आन-बान और शान होती हैं : PM @narendramodi
— PMO India (@PMOIndia) March 8, 2018
Important to provide proper nutrition to children: PM @narendramodi #NariShakti4NewIndia
— PMO India (@PMOIndia) March 8, 2018
Mission Indradhanush has brought an extremely positive change in the lives of women and children: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 8, 2018
We began the POSHAN Abhiyaan with an unwavering commitment to ensure proper nutrition facilities for our women and children. India will progress when our youth and Nari Shakti are healthy. Here is my speech at Jhunjhunu, Rajasthan today. https://t.co/CPfFzj9E6H pic.twitter.com/kYoF625uL3
— Narendra Modi (@narendramodi) March 8, 2018