Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ సుగుడా విమానాశ్రయం మ‌రియు ఇతర అభివృద్ధి పథకాలను ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో దేశ ప్రజలకు అంకితం చేసిన కార్య‌క్ర‌మం లో ప్రధాన మంత్రి ఉప‌న్యాసం

ఝార్ సుగుడా విమానాశ్రయం మ‌రియు ఇతర అభివృద్ధి పథకాలను ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో దేశ ప్రజలకు అంకితం చేసిన కార్య‌క్ర‌మం లో  ప్రధాన మంత్రి ఉప‌న్యాసం

ఝార్ సుగుడా విమానాశ్రయం మ‌రియు ఇతర అభివృద్ధి పథకాలను ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో దేశ ప్రజలకు అంకితం చేసిన కార్య‌క్ర‌మం లో  ప్రధాన మంత్రి ఉప‌న్యాసం

ఝార్ సుగుడా విమానాశ్రయం మ‌రియు ఇతర అభివృద్ధి పథకాలను ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో దేశ ప్రజలకు అంకితం చేసిన కార్య‌క్ర‌మం లో  ప్రధాన మంత్రి ఉప‌న్యాసం


 

ఒడిశా గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మాన్ ప్రొఫెస‌ర్ గ‌ణేశీ లాల్ గారు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీమాన్‌ న‌వీన్ ప‌ట్నాయ‌క్ గారు, కేంద్ర మంత్రివ‌ర్గం లో నా స‌హ‌చ‌రులు శ్రీ జుయెల్ ఉరావ్ గారు, శ్రీమాన్‌ ధర్మేంద్ర ప్రధాన్ గారు ల‌తో పాటు ఇక్క‌డకు విచ్చేసిన ఇత‌ర మాన‌నీయ వ్య‌క్తులారా,

తాల్‌చేర్ లో వ్యాపారం చాలించిన ఎరువుల క‌ంపెనీ ని సుమారు 13 వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో మేం ఈ రోజున పున‌రుద్ధ‌రించాం.  నేను అక్క‌డి నుండి ఇక్క‌డకు వ‌చ్చాను.  ఒక విధం గా, అది ఆ ప్రాంతం లో ఆర్థిక కార్య‌క‌లాపాల‌ కు ఒక కేంద్రం గా మార‌బోతోంది.  ఒక న‌వీన‌మైన ఒడిశా, ఒక ఆధునిక‌మైన భార‌త‌దేశం.. అధునాత‌న‌మైన మౌలిక స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చుకోవ‌ల‌సిన అవసరం ఉంది.  ఈ కార‌ణం గానే, నేను ఇక్క‌డ వీర సురేంద్ర సేన్ విమానాశ్ర‌యాన్ని ప్రారంభించే అవ‌కాశాన్ని దక్కించుకున్నాను.  ఇక్క‌డ‌కు వ‌చ్చే ప్ర‌యాణికులు వీర సురేంద్ర సేన్ ను గురించి విన్నప్పుడు, ఒడిశా ప‌రాక్ర‌మం, ఒడిశా చేసిన త్యాగం మ‌రియు ఒడిశా స‌మ‌ర్ప‌ణ భావం తాలూకు గాథ‌ల వైపు నకు ఆక‌ర్షితులు కావడం స్వాభావిక‌మే అవుతుంది.

ఈ రోజున, ఇక్క‌డ అనేక ఇత‌ర బృహ‌త్ ప‌థ‌కాల‌ను ప్రారంభించే అవ‌కాశం నాకు ల‌భించింది.  ఇది ఒడిశా లో కెల్లా రెండో అతి పెద్ద విమానాశ్ర‌యం గా ఉంటుంది.  అనేక సంవ‌త్స‌రాలు గా దీనిని ఎందుకు నిర్మించ‌ లేదో అన్వేషించ‌వ‌ల‌సింది మీరే.  బ‌హుశా ఇది నా కోసం నిరీక్షిస్తూ ఉండి ఉంటుంది.

నేను గుజ‌రాత్ కు చెందిన వాడిని.  అక్క‌డ్ ‘క‌చ్ఛ్’ అని ఒక జిల్లా ఉంది.  అది ఒక ఎడారి.  దానికి అవ‌త‌లి వైపున పాకిస్తాన్ ఉంది.  ఆ జిల్లా లో అయిదు విమానాశ్ర‌యాలు ఉన్నాయి.  ఇవాళ అనేక సంవ‌త్స‌రాల అనంత‌రం ఒడిశా లో రెండో విమానాశ్ర‌యం నిర్మాణం ఇప్పుడే ప్రారంభమవుతోంది.  దేశం లోని విమాన‌యాన రంగం లో చోటు చేసుకొంటున్న పురోగ‌తి ఏ కోవ‌ కు చెందింద‌నేది సురేశ్ గారు కొద్ది సేప‌టి క్రితం వెల్ల‌డించారు.  స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి దేశం లో ఇంత‌వ‌ర‌కు వినువీధిన ప్ర‌యాణిస్తున్న విమానాల మొత్తం సంఖ్య కేవ‌లం దాదాపుగా 450 అని తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.  స్వాతంత్య్రం అనంత‌ర కాలం లో ప‌రిస్థితి ఇది.  మ‌రి ఈ ఒక్క సంవ‌త్స‌రం లోనే 950 నూత‌న విమానాల కోసం ఆర్డ‌ర్లు పెట్ట‌డం జ‌రిగింది.  మ‌నం సాధించ‌బోయేది ఏమిటనే అంశం తో పాటు మ‌నం ఎంత వేగం గా పురోగ‌మిస్తున్నాం అనేది ఎవ‌రైనా ఊహించ‌గ‌లరా?.  వీర సురేంద్ర సేన్ విమానాశ్ర‌యం నిర్మాణం అవుతున్న‌టువంటి ప్ర‌దేశం మూడు ప్రాంతాలు.. భువ‌నేశ్వ‌ర్‌, రాంచీ మ‌రియు రాయ్‌పుర్.. ల‌కు కేంద్రం గా ఉందని నేను అనుకుంటున్నాను.  ఇది ఎన్నో అభివృద్ధి అవ‌కాశాల‌కు రెక్క‌లు తొడ‌గ‌బోతోంది.  ప‌ర్య‌వ‌సానంగా అభివృద్ధి లో ఒక కొత్త ప్ర‌యాణాన్ని ఆరంభించనుంది.  

ఝార్‌సుగుడా లో, సంబ‌ల్‌పుర్ లో మ‌రియు ఇంకా  ఛ‌త్తీస్‌గ‌ఢ్ సమీప ప్రాంతాల‌ లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకొనే పారిశ్రామిక‌వేత్త ల‌కు ఈ త‌ర‌హా సౌక‌ర్యాలు అత్యంత ముఖ్య‌మైన‌టువంటివి.  వారు ఈ ప్రాంతానికి గ‌నుక సుల‌భంగా ప్ర‌యాణించ గ‌లిగిన ప‌క్షం లో దీనిని వ్యాపారాత్మ‌క‌మైన దృష్టి కోణం నుండి చూడాల‌ని భావిస్తారు.  మా ఆలోచ‌న‌ లో ‘‘స‌బ్‌కా సాథ్, స‌బ్‌కా వికాస్’’ కు అర్థం ఏమిటంటే ప్రాంతాల మ‌ధ్య స‌మ‌తుల్య‌త ఉండాల‌నేదే.  ఈ ర‌క‌మైన అస‌మ‌తుల్య‌త న‌డుమ ప‌శ్చిమ భార‌త‌దేశం మాత్ర‌మే అభివృద్ధి చెందుతూ ఉంటే, మ‌రి తూర్పు భార‌తావ‌ని అభివృద్ధి ప‌రంగా వెనుక‌ప‌ట్టు ప‌డుతూ దేశానికి ఒక సంక్షోభాన్ని సృష్టించ గ‌ల‌దు.  ఈ కార‌ణంగానే, తూర్పు భార‌తావ‌ని ని అభివృద్ధి పరచాల‌నేది మా నిరంత‌ర య‌త్నం గా ఉంది.  ఒడిశా ను అభివృద్ధి చేయడం ఇందులో ఓ ముఖ్య‌మైన‌టువంటి భాగం.  అది తూర్పు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కావ‌చ్చు, లేదా ఒడిశా కావ‌చ్చు, లేదా ప‌శ్చిమ బెంగాల్ కావ‌చ్చు, లేదా అస‌మ్ కావ‌చ్చు, లేదా ఈశాన్య ప్రాంతం కావ‌చ్చు.. యావ‌త్తు ప్రాంతం అభివృద్ధి చెందడం అత్యంత ముఖ్య‌మైన‌ అంశం.

ఈ రోజున ఇక్క‌డ నేను ఒక విమానాశ్ర‌యాన్ని ప్రారంభిస్తున్నాను.  రేప‌టి త‌రువాతి రోజున ఒక విమానాశ్ర‌యాన్ని ప్రారంభించడం కోసం నేను సిక్కిమ్ కు వెళ్తున్నాను.  ఎంత ప‌ని జ‌రుగుతున్నదీ, అది కూడాను ఎంత వేగంగా జ‌రుగుతున్నదీ మీరు ఊహించుకోవ‌చ్చును.  నేడు ఒక బొగ్గు గ‌ని ని దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేసే అవ‌కాశం కూడా నాకు చిక్కింది.  శ‌క్తి అనేది కార్య‌క‌లాపాల‌న్నింటికి కేంద్రం గా ఉన్న విష‌యం మీరు ఎరుగుదురు.  మ‌రి ఒడిశా చేసుకున్న అదృష్టం ఏమిటంటే ఇక్క‌డ న‌ల్ల‌ని వ‌జ్రాల ఖ‌జానా యే ఉంది.  ఈ రోజున గ‌ని లో నుండి బొగ్గును వెలికి తీసే ప‌ని ప్రారంభం అవుతోంది.  అంతేకాదు, ఆ బొగ్గు నుండి శ‌క్తి ని ఉత్ప‌త్తి చేసే ప‌ని కూడా మొద‌లవుతోంది.  ఇక్క‌డ అభివృద్ధి అవ‌కాశాలు ఉజ్వ‌ల‌మ‌వుతాయ‌నే దీని భావం.

ఈ రోజున, ఒక రైల్వే ప్రాజెక్టు ఓ విమానాశ్ర‌యాన్ని జోడించ గ‌ల‌దు.  సంధానం అనేది అభివృద్ధి ని ఇనుమ‌డింప చేయ‌డం లో ఒక ప్రధానమైన భూమిక ను పోషిస్తోంది.  అది హైవే కావ‌చ్చు, లేదా రైలు మార్గం కావ‌చ్చు,  లేదా ఎయిర్ వేస్ కావ‌చ్చు, లేదా జ‌ల మార్గం కావ‌చ్చు.  అన్ని ప్రాంతాల‌ను జ‌త‌ప‌ర‌చేట‌టువంటి ఇంట‌ర్ నెట్ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది.

ఈ ఆదివాసీ ప్రాంతం ఈ రోజున రైలు మార్గం తో జోడించ‌బ‌డుతోంది.  ఇది ఒక ముఖ్య‌మైన అడుగు అని చెప్పాలి.  భ‌విష్య‌త్తు లో సంధానం అనేది ఒడిశా స‌ర్వ‌తోముఖాభివృద్ధి లో ఒక మేలు మ‌లుపు అవుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను.  వీర సురేంద్ర సేన్ విమానాశ్ర‌యాన్ని ఈ ప్రాంతం ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తున్నందుకు నేను గ‌ర్వపడుతున్నాను.

మీ అంద‌రికీ అనేకానేక ధ‌న్య‌వాదాలు.