పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘టి20 బ్లయిండ్ క్రికెట్ వరల్డ్ కప్’ ను గెలుచుకొన్న జట్టుతో ఈ రోజు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వారు సాధించిన విజయాలకుగాను వారిని అభినందించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రతిభను ప్రదర్శించాలని వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. వారి యొక్క ఏకాగ్రతను మరియు ప్రత్యేక కౌశలాన్ని ఆయన ప్రశంసించారు. వారు చేసిన పని దివ్యాంగులతో సహా లక్షలాది ప్రజలకు ప్రేరణనిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.
జట్టు సభ్యులు సంతకాలు చేసిన ఒక బ్యాటును, ఒక బంతిని, ఇంకా ప్రధాన మంత్రి పేరుతో ఉన్న ఒక జట్టు జెర్సీ ని శ్రీ మోదీకి బహుమతిగా ఇచ్చారు.
ప్రధాన మంత్రి కూడా తన సంతకంతో కూడిన ఒక బ్యాటును మరియు ఒక బంతిని జట్టు కు అందజేశారు.