పిఎంఇండియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. డబుల్ టాక్సేషన్ నుంచి తప్పించుకోవటం, ఆదాయపు పన్ను వార్షిక ఎగవేతను అడ్డుకోవటంపై భారత-వియత్నాం దేశాల మధ్య ప్రొటోకాల్ అమలుకు ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది.
ఈ ప్రొటోకాల్ వల్ల అంతర్జాతీయంగా ప్రభావవంతమైన ఆమోదించబడిన పన్ను విషయాల్లో సమాచార మార్పిడి, బ్యాంకుల సమాచారం, దేశీయ పన్నులను మినహాయించి పూర్తి వివరాలు ఒకరికొకరు మార్పు చేసుకునే వీలుంటుంది. వియత్నాంలో ఉంటున్న ఓ భారతీయుడి పూర్తి వివరాలను ‘కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ వియత్నాం’ ద్వారా అక్కడి ప్రభుత్వం మనకు అందిస్తుంది. అలాగే మనం కూడా అక్కడి దేశస్తుల వివరాలను వియత్నాం ప్రభుత్వానికి అందివ్వాల్సి ఉంటుంది.
పూర్వరంగం
ప్రస్తుతం భారత్-వియత్నాం దేశాల్లో అమల్లో ఉన్న డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రీమెంట్ (డీటీటీఏ)పై 1994లో సంతకాలు జరిగాయి. భారత-వియత్నాం దేశాలు గతంలో డీటీటీఏ కోసం ఆర్టికల్ 27లో ‘సమాచార మార్పిడి’ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. ప్రొటోకాల్ అమలవటం, అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ఒప్పందాల నాణ్యతను చేరుకునేందుకు ‘పన్నుల వసూలుకు సహాయం’ అనే కొత్త ఆర్టికల్‌ను చేర్చాయి.