Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ను రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఢిల్లీ లోని 15, జన్ పథ్ లో డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఆయన డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ సోశియో- ఇకనామిక్ ట్రాన్స్ ఫర్మేశన్ (డిఎఐసిఎస్ఇటి) ని కూడా ప్రారంభిస్తారు.

‘‘ఢిల్లీ లోని 15, జన్ పథ్ లో డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ను రేపు ఉదయం 11 గంటలకు నేను ప్రారంభించనున్నాను. ఈ సందర్భం నాకు మరింత ప్రత్యేకమైంది; ఎలాగంటే, ఈ కేంద్రానికి పునాదిరాయిని వేసే అవకాశం నాకు లభించింది. దేశ రాజధాని నడి బొడ్డున ఈ కేంద్రం నెలకొనడం డాక్టర్ ఆంబేడ్కర్ కు సరైన ప్రశంస.

బౌద్ధ కాలపు మరియు ప్రస్తుత కాలపు వాస్తు కళ ల మేలు కలయికగా డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ఉంటుంది. చర్చాసభా మందిరంతో పాటు సమావేశ మందిరాలు ఇందులో భాగంగా ఉంటాయి. సమృద్ధమైనటువంటి డిజిటల్ భండారాన్ని కలిగిన విస్తృత గ్రంథాలయం, ఇంకా మూడు సభాభవనాలు ఇందులో ఉన్నాయి.

డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ సోశియో- ఇకనామిక్ ట్రాన్స్ ఫర్మేశన్ (డిఎఐసిఎస్ఇటి) ని కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది. ఈ సంస్థ కీలకమైన అంశాలలో చర్చలను ప్రోత్సహించడంతో పాటు దారిని చూపుతుంది; అలాగే పరిశోధన ను ప్రోత్సహించి, యువతలో మౌలిక చింతనను పెంపొందిస్తుంది కూడా’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.