పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 16,2018న ఉత్తరప్రదేశ్ సందర్శించనున్నారు.
రాయ్‌బరేలిలో ప్రధానమంత్రి ఆధునిక కోచ్ ఫ్యాక్టరీని తనిఖీ చేస్తారు. అక్కడ జరిగే ఒక బహిరంగ సభలో ఈ ఫ్యాక్టరీకి చెందిన 900 కోచ్‌లు, హమ్‌సఫర్ రైలు బోగీల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అక్కడ నుంచి ప్రధానమంత్రి ప్రయాగ్‌రాజ్ వెళతారు. అక్కడ కుంభమేళాకు అత్యాధునిక కమాండ్,కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. గంగా పూజ చేసి స్వచ్ఛ కుంభ్ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో అక్షయావత్‌ను కూడా సందర్శిస్తారు.
అక్కడ నుంచి ప్రధానమంత్రి అండావా వెళతారు. అక్కడ వివిధ అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభిస్తారు. కొన్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధానమంత్రి అక్కడ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని బమ్‌రౌలి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి ఢిల్లీ తిరిగి వెళ్లడానికి ముందు
విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు.