Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డి ఎ వి కళాశాల క‌ళాశాల నిర్వ‌హ‌ణ సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ”న‌యీ దిశా, న‌యా సంక‌ల్ప్” కార్య‌క్ర‌మంలో విద్యార్థుల‌ను, అధ్యాప‌కుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

డి ఎ వి కళాశాల క‌ళాశాల నిర్వ‌హ‌ణ సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ”న‌యీ దిశా, న‌యా సంక‌ల్ప్” కార్య‌క్ర‌మంలో విద్యార్థుల‌ను, అధ్యాప‌కుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ద‌యానంద ఆంగ్లో వేదిక్ కాలేజీ మేనేజింగ్ క‌మిటీ ఏర్పాటు చేసిన ”న‌యీ దిశా, న‌యా సంక‌ల్ప్” (నూత‌న దిశ‌, నూత‌న సంక‌ల్పం) కార్య‌క్ర‌మంలో పాల్గొని, విద్యార్థుల‌ను, అధ్యాప‌కుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, స్వామి ద‌యానంద ఈ నాటికీ స్ఫూర్తిని అందిస్తున్నార‌ని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం 1857లో త‌లెత్తిన తిరుగుబాటు నేప‌థ్యంలో రూపు దిద్దుకొన్న‌ ఆర్య‌ స‌మాజ్ మూఢ‌ విశ్వాసాల‌ పైన పోరు స‌ల్పింద‌ని, అది మొద‌లు సంస్క‌ర‌ణ‌కు న‌డుం క‌ట్టిన ఒక ప్ర‌బ‌ల‌ శ‌క్తిగా ఉంటూ వ‌స్తోంద‌ని వివ‌రించారు.

ప్ర‌పంచం దృష్టిలో భార‌తదేశ స్థాయిని పెంపొందించ‌డ‌మే మ‌న నూత‌న సంక‌ల్పం కావాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ దిశ‌గా ప‌నిచేయ‌డ‌మే స్వామి ద‌యానంద‌కు నిజ‌మైన శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టించ‌డం అవుతుంద‌న్నారు. డి ఎ వి విద్యార్థులు, ప‌ట్ట‌భ‌ద్రులు భారీ సంఖ్య‌లో ఉన్నారు.. వారు కొన్ని అంశాల‌పైన ప‌నిచేయాల‌ని త‌ల్చుకొంటే గ‌న‌క స్వ‌ల్ప కాలంలోనే చెప్పుకోద‌గిన ఫ‌లితాలు సాధించ‌గ‌లుగుతారు.. ఆధునిక‌మైన‌, శాస్త్రీయ మైన 21వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశాన్ని త‌యారు చేయ‌డ‌మే ఎల్ల‌ప్ప‌టికీ వారి ప్ర‌య‌త్నం కావాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

తాను త‌ల‌పెట్టిన‌ గంగాన‌ది శుద్ధి కార్య‌క్ర‌మానికి అండ‌దండ‌లు అంద‌జేయ‌డానికి డి ఎ వి క‌ళాశాల నిర్వ‌హ‌ణ సంఘం ముందుకు వ‌చ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న స్వాగ‌తించారు. ప్ర‌జ‌ల ప్ర‌మేయంతోనే గంగాన‌ది శుద్ధి కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అవుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

యువ‌త ల‌బ్ధి కోసం ప్ర‌భుత్వం ‘ముద్రా యోజ‌న‌’, స్టార్ట‌ప్ ఇండియా, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ల‌ వంటి వేరు వేరు కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

***