పిఎంఇండియా
వరుసగా మూడోసారి అద్భుత విజయం సాధించి డెన్మార్క్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మెట్టె ఫ్రెడరిక్సన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలియజేశారు.
భారత్, డెన్మార్క్‌ల మధ్య పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉమ్మడి నిబద్ధతపై ఆధారపడిన శాశ్వత భాగస్వామ్యం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్-డెన్మార్క్ ‘హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజా ప్రయోజనాల కోసం ఈ సహకారాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి ఫ్రెడరిక్సన్తో కలిసి సన్నిహితంగా పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“వరుసగా మూడోసారి అద్భుత విజయం సాధించి డెన్మార్క్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నా స్నేహితురాలు మెట్టె ఫ్రెడరిక్సన్కు హృదయపూర్వక అభినందనలు.
భారత్, డెన్మార్క్‌ల మధ్య పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉమ్మడి నిబద్ధతపై ఆధారపడిన శాశ్వత భాగస్వామ్యం ఉంది. భారత్-డెన్మార్క్ ‘హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజా ప్రయోజనాల కోసం మన సహకారాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి ఫ్రెడరిక్సన్తో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.”
Congratulations to my friend Ms. Mette Frederiksen on assuming office as the Prime Minister of Denmark for a remarkable third consecutive term.
— Narendra Modi (@narendramodi) June 3, 2026
India and Denmark share an enduring partnership founded on mutual trust, shared values and a common commitment to a sustainable future.…