Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలోని షాదారా జిల్లాలో అగ్నిప్రమాద ఘటన… మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం


ఢిల్లీలోని షాదారా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ ఘోర ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలిపారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్నుంచి రూ. 2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందజేస్తామని శ్రీ మోదీ ప్రకటించారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఢిల్లీలోని షాదారా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం అత్యంత బాధాకరంప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపంగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం.

మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తాంగాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం.

 

***