Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా


ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆఫ్రికా సమాఖ్య చైర్‌పర్సన్బురుండి దేశాధ్యక్షుడు ఎవరిస్టే ఎన్దాషిమియేతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

భారతదేశ అధ్యక్ష పదవీ కాలంలో 2023లో ఆఫ్రికా సమాఖ్య(ఏయూజీ20లో చేరే విషయంలో భారత్ పోషించిన పాత్రను ఇద్దరు నేతలు గుర్తు చేశారుగ్లోబల్ సౌత్ పరిధిలో భారత్ఆఫ్రికా సమాఖ్య భాగస్వామ్యం సహకారానికి ఒక ప్రధాన ఆధారమని వారు చెప్పారుపరస్పరం అనుకూలమైన తేదీలో 4వ భారత్ఆఫ్రికా ఫోరమ్ సదస్సును (ఐఏఎఫ్ఎస్-IV) త్వరలో నిర్వహించడం గురించి వారు చర్చించారు.

ఎబోలా వ్యాప్తిని విజయవంతంగా ఎదుర్కొనే విషయంలో ఏయూ నాయకత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టటంలో ఆఫ్రికా సీడీసీకి భారత్‌ అందించిన వైద్యపరమైన మద్దతును ఏయూ చైర్‌పర్సన్ ప్రశంసించారు.

సహృద్భావ వాతావరణంఐక్యతఉమ్మడి అభివృద్ధి ఆకాంక్షలతో ముడిపడి ఉన్న భారత్– బురుండి సంబంధాలను ఇద్దరు నేతలు చర్చించారుఆర్థిక సహకారంఅభివృద్ధి భాగస్వామ్యంవ్యవసాయ ఆధునికీకరణఆరోగ్య సంరక్షణసామర్థ్య పెంపు కార్యక్రమాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను వారు సమీక్షించారు.

 

***