పిఎంఇండియా
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా, కేంద్ర మంత్రివర్గ సహచరులు మనోహర్ లాల్, హర్ష్ మల్హోత్రా, తోఖన్ సాహు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరికీ, గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, నా ప్రియమైన ఢిల్లీ సోదరీ, సోదరులకు నమస్కారం.
అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాం. కాసేపటి క్రితమే, ముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. మెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయి, ఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోంది. ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతో, ఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది. ఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
నేటి కార్యక్రమం మరో కారణం చేత కూడా ప్రత్యేకం. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారత్ నేడు మహిళా సాధికారతకు సంబంధించి కొత్త చరిత్ర రాస్తోంది. రేఖా గుప్తా విజయవంతమైన నాయకత్వంలో రాజధాని నగరం ముందుకు సాగుతోంది. రాజకీయాలు, పరిపాలన, సైన్స్, క్రీడలు లేదా సామాజిక సేవ ఇలా ప్రతి రంగంలోనూ భారత మహిళా శక్తి కొత్త ఉత్సాహంతో దూసుకుపోతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. దేశ అభివృద్ధిలో వారి అపారమైన కృషిని గుర్తించడమే కాకుండా, సమాజాన్ని, దేశాన్ని వారు మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు వారు కొత్త శక్తిని అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ వారికి అనేకానేక శుభాకాంక్షలు.
మిత్రులారా,
ప్రపంచంలో ఎవరైనా భారత్ వంటి భారతదేశం లాంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశం గురించి ఆలోచించినప్పుడు, తరచుగా ఢిల్లీ చిత్రమే గుర్తుకు వస్తుంది. ఢిల్లీ కేవలం భారత రాజధాని మాత్రమే కాదు. ఇది భారతదేశ గుర్తింపు, భారత శక్తికి చిహ్నం. అందువల్ల, ఢిల్లీ అభివృద్ధి అంటే కేవలం ఒక నగరం అభివృద్ధి మాత్రమే కాదు. ఇది దేశం మొత్తం ప్రతిష్టతో ముడిపడి ఉంది. ఢిల్లీ ఎంత ఆధునికంగా మారుతుందో, ఢిల్లీలో సౌకర్యాలు ఎంత పెరుగుతాయో, ఢిల్లీ అనుసంధానం ఎంత మెరుగుపడుతుందో అంత బలంగా భారతదేశ ఆత్మవిశ్వాసం ప్రపంచం ముందు కనిపిస్తుంది. అందుకే, నేడు మన ఢిల్లీ నగరం సౌకర్యాలు, మౌలిక సదుపాయాల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఒకప్పుడు ఢిల్లీ అంటే కేవలం ఇక్కడి అస్తవ్యస్త ఏర్పాట్ల గురించే చర్చ జరిగే రోజులు ఉండేవి. నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే గంటల సమయం పట్టేది. బస్ స్టాండ్లలో బస్సులు, ఆటోల కోసం వేచి చూస్తూ తల్లులు, అక్కాచెల్లెళ్ళ సమయం వృధా అయ్యేది. కానీ నేడు ఢిల్లీ ముఖచిత్రం మారుతోంది. కేవలం కొన్ని రోజుల క్రితమే, వేగవంతమైన ‘నమో భారత్‘ రైలు ఢిల్లీని మీరట్‌తో అనుసంధానించింది. దీనివల్ల ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణం సులభమైంది. నేడు మెట్రో నాలుగో దశ ప్రారంభంతో, ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ పరిధి 375 కిలోమీటర్లు దాటింది. ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో కూడా ఇంతటి భారీ మెట్రో నెట్‌వర్క్ లేదు.
మిత్రులారా,
నేడు ప్రారంభమైన కొత్త మెట్రో మార్గం రాజధానిలోని లక్షలాది మందికి ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రజలకు రోజువారీ ప్రయాణం ఇప్పుడు చాలా సులభం అవుతుంది. దీనితో పాటు, ఢిల్లీ, ఎన్‌సిఆర్ నగరాలైన ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ మధ్య ప్రయాణం కూడా మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
మిత్రులారా,
ఏడాది క్రితం ఢిల్లీ ఒక ప్రమాదకరమైన ప్రభుత్వం నుంచి విముక్తి పొందడం ఎంత మంచిదన్నది చెప్పడానికి నేటి కార్యక్రమం ఒక నిదర్శనం. ఇక్కడ ఆ ప్రమాదకర ప్రభుత్వం లేకపోయి ఉంటే, మెట్రో నాలుగో దశ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేది. కానీ ఆ దుష్ప్రభుత్వ పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలోని లక్షలాది మంది సౌకర్యాలను పక్కన పెట్టారు. ఇప్పుడు ఇక్కడ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీ సర్వతోముఖాభివృద్ధికి గొప్ప వేగం వచ్చింది.
మిత్రులారా,
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఢిల్లీలోని ప్రతి రవాణా సౌకర్యం ఆధునికత సంతరించుకుంటోంది. ఢిల్లీలో ప్రతిరోజూ లక్షలాది మంది బస్సుల్లో ప్రయాణిస్తారు. అందుకే ఢిల్లీ ప్రజలకు శుభ్రమైన, సౌకర్యవంతమైన, ఆధునిక బస్సు సేవలు అందించాలన్నది మా ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం అందించిన నాలుగు వేల పైగా ఎలక్ట్రిక్ బస్సులు నేడు ఢిల్లీ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. గత ఒక్క ఏడాదిలోనే సుమారు 1800 కొత్త బస్సులు ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చాయి. వీటిలో వందలాది “దేవి బస్సులు” ఢిల్లీలోని కాలనీలను, పరిసర ప్రాంతాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తున్నాయి.
మిత్రులారా,
దాదాపు పదేళ్ల పాటు ఇక్కడి ప్రమాదకర ప్రభుత్వం ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంది. ఇప్పుడు మా ప్రభుత్వం ఢిల్లీకి సంబంధించిన వివిధ సవాళ్లను పరిష్కరించేందుకు ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో లక్షలాది వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించాల్సిన అవసరం తప్పింది. యమునా నది శుభ్రత కోసం కూడా బిజెపి ప్రభుత్వం భారీ స్థాయిలో పనిచేస్తోంది. దీని కోసం కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
మిత్రులారా,
ఢిల్లీలోని గత ప్రభుత్వం పేదల, మధ్యతరగతి ప్రజల లేదా మరెవరి సమస్యలను గురించీ పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని కూడా నాశనం చేసింది. ఆయుష్మాన్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ మేము వారికి లేఖలు రాశాం. భారత ప్రభుత్వం కూడా లేఖలు రాసింది. కానీ ఆ పాలకులు పేదలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు రేఖాజీ నాయకత్వంలో, ఈ పరిస్థితిని మార్చడానికి బిజెపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. గత ఒక్క ఏడాదిలోనే, ఇక్కడ అనేక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ఇప్పుడు ఢిల్లీలో ఆయుష్మాన్ పథకం కూడా అమలవుతోంది. ఢిల్లీ ప్రజలకు ఉచిత వైద్యం అందుతోంది. తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తక్కువ పని, ఎక్కువ సాకులు చెప్పడం ఆ ప్రమాదకర ప్రభుత్వ పాలకుల విధానం. నేడు ఢిల్లీ నమూనా అంటే – సాకులు ఆగిపోయాయి. పని మొదలైంది. గతంలో ప్రాజెక్టులు ఫైళ్లలోనే ఆగిపోయేవి. నేడు ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి.
మిత్రులారా,
ఇక్కడికి వచ్చే ముందు నేను సరోజినీ నగర్‌కు వెళ్లాను. అక్కడ కొత్తగా నిర్మించిన ప్రభుత్వ గృహాలను చూసే అవకాశం నాకు లభించింది. ప్రతి జాతీయ సంకల్పాన్ని నెరవేర్చడానికి పగలు రాత్రి కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ఇళ్లు నిర్మించాం. వారికి సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నివాసం లభించడం చాలా అవసరం. అందుకే ఈ కొత్త, ఆధునిక భవనాలను నిర్మిస్తున్నాం. నేడు అటువంటి వేలాది కొత్త ఫ్లాట్లను లబ్ధిదారులకు అందించాం. ఈ కొత్త ఇళ్లు మన ఉద్యోగుల, వారి కుటుంబాల జీవితాల్లో కొత్త ఆనందాన్ని, కొత్త ఆశను నింపుతాయని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
నేడు దేశంలో ఎక్కడ బిజెపి ప్రభుత్వం ఉన్నా, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, నగరంలో ప్రజలు ఏదో ఒక పథకం ద్వారా కచ్చితంగా ప్రయోజనం పొందుతున్నారు. మన పేద కుటుంబాలు, మన తల్లులు, అక్కాచెల్లెళ్ళు, మన కార్మికులు, రైతులు, చిన్న చిన్న పనులు చేసుకునే మన సోదరీ,సోదరులు – వీరందరి కోసం ప్రభుత్వం ఏదో ఒక పని చేస్తూనే ఉంది. మన వీధి వ్యాపారులనే ఉదాహరణగా తీసుకుందాం. కరోనా సమయంలో మన దైనందిన జీవితాల్లో వారి ప్రాముఖ్యతను గుర్తించాం. ఒకప్పుడు తోపుడు బండ్లను కూడా అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితిలో వీరు ఉండేవారు. ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టడానికి కూడా వేరే వారి దగ్గర ఒకటి లేదా రెండు వేల రూపాయలను భారీ వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ మా ప్రభుత్వం వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించింది. నేడు ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా, అటువంటి లబ్ధిదారులు తమ వ్యాపారాల కోసం సులభంగా రుణాలు పొందుతున్నారు. ఢిల్లీలో కూడా సుమారు 2 లక్షల మంది వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా దాదాపు 350 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పొందారు.
We are committed to building a modern and Viksit Delhi. The projects launched today will strengthen infrastructure, improve connectivity and enhance the ease of living for people of the city.
— Narendra Modi (@narendramodi) March 8, 2026
https://t.co/BrUJqDQj50
भारत की नारी शक्ति हर क्षेत्र में एक नई ऊर्जा से आगे बढ़ रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 8, 2026
दिल्ली का विकास केवल एक शहर का विकास नहीं होता, यह पूरे देश की छवि से जुड़ा होता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 8, 2026
आज जो मेट्रो का नया सेक्शन शुरू हुआ है, उससे राजधानी के लाखों लोगों को बहुत बड़ी सुविधा मिलने वाली है।
— PMO India (@PMOIndia) March 8, 2026
खासतौर पर पूर्वी और उत्तर-पूर्वी दिल्ली के लोगों के लिए अब रोज़ का सफर पहले से कहीं ज्यादा आसान होगा: PM @narendramodi
सरकार ने रेहड़ी-पटरी वाले साथियों के लिए स्वनिधि क्रेडिट कार्ड देने का अभियान चलाया है।
— PMO India (@PMOIndia) March 8, 2026
अब उनकी जेब में ही क्रेडिट कार्ड होगा जिसे वो अपनी जरूरत के अनुसार उपयोग कर पाएँगे: PM @narendramodi