పిఎంఇండియా
తనకు శుభాకాంక్షలు తెలియజేయటంతో పాటు తన గురించి మంచి మాటలు చెప్పిన రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ముకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ధన్యవాదాలు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల ఆప్యాయత, విశ్వాసం, దీవెనలతో ప్రతి దశలో రూపుదిద్దుకున్న ఈ కాలం తనకు ఒక సంతృప్తికరమైన సేవా ప్రయాణమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో దేశ పరివర్తనలో కోట్లాది మంది భారతీయులు భాగస్వాములు కావటమే దేశం సాధించిన ప్రగతి సాధ్యమైందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మార్పు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో కనిపించటంతో ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
అందరూ కలిసి ‘వికసిత్ భారత్’ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో తాను అదే విధమైన కర్తవ్య దీక్షతో, అంకితభావంతో దేశానికి సేవ చేయడం కొనసాగిస్తానని ప్రధాని పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“రాష్ట్రపతి గారూ.. మీ శుభాకాంక్షలు, ఉదారమైన మాటలకు ధన్యవాదాలు.
ప్రజల ఆప్యాయత, విశ్వాసం, దీవెనలతో గడచిన ఈ సంవత్సరాలు నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సేవా ప్రయాణంగా నిలిచాయి.
కోట్లాది మంది భారతీయులు ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో దేశ పరివర్తనలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకోవటం వలనే మనం చూసిన ప్రగతి సాధ్యమైంది. ఈ మార్పు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో కనిపించటం సంతోషంగా ఉంది.
మనమందరం కలిసి ‘వికసిత్ భారత్’ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో అదే కర్తవ్య దీక్షతో, అంకితభావంతో నేను మన దేశానికి సేవ చేయడం కొనసాగిస్తాను.”
Rashtrapati Ji, thank you for the wishes and generous words. These years have been a deeply fulfilling journey of service, shaped at every stage by the affection, faith and blessings of the people. Whatever progress we have witnessed has been possible because crores of Indians chose to participate in the nation’s transformation with confidence and determination. It is especially heartening to see this change reflected in everyday lives. I shall continue to serve our nation with the same spirit of duty and devotion as we all move together towards building a Viksit Bharat. @rashtrapatibhvn
— Narendra Modi (@narendramodi) October 7, 2026