Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తపాలా విభాగము మరియు పోర్చుగల్ పోస్టుకు మధ్య తపాలా బిళ్లల సంయుక్త విడుదల


తపాలా విభాగము మరియు పోర్చుగల్ పోస్టుకు మధ్య తపాలా బిళ్లల సంయుక్త విడుదల అంశాన్ని కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

భారత దేశానికి, పోర్చుగల్ కు మధ్య చక్కని ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఇరు పక్షాలకు సంబంధించిన అనేక అంశాలపై వివిధ వేదికల పై తరచుగా క్రియాశీలమైన సమన్వయంతో ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలియజేసుకొంటూ వస్తున్నారు. ఈ సమన్వయం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉండడంతోపాటు, ఫలప్రదం అవుతున్నది. గత కొన్నేళ్లుగా ఈ రెండు దేశాలు మరింత గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నాయి. తాజాగా సంయుక్త తపాలా బిళ్లల విడుదల అంశం కూడా రెండు దేశాల తపాలా విభాగాలకు పోస్టేజి స్టాంపుల సంకలనంలో తోడ్పడనున్నది.