Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తపాలా స్టాంపులను సంయుక్తంగా విడుదల చేయడంపై భారత, ఆర్మేనియా దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.


తపాలా స్టాంపులను సంయుక్తంగా విడుదల చేయడంపై భారత, ఆర్మేనియా దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2018 జూన్ నెలలో ఈ అవగాహనా ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం, ‘నృత్యం” ఇతివృత్తంపై భారత, ఆర్మేనియా దేశాలు సంయుక్తంగా తపాలా స్టాంపులు విడుదల చేయాలని – భారత తపాలా శాఖ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, ఆర్మేనియాకు చెందిన జాతీయ తపాలా నిర్వహణ సంస్థ – “హే పోస్ట్” సీ జే ఎస్ సి – సంయుక్తంగా అంగీకరించాయి. 2018 ఆగష్టు లో ఈ తపాలా స్టాంపులను విడుదల చేశారు.

భారతదేశానికి చెందిన “మణిపురి నాట్యం” అర్మేనియా కు చెందిన “హోవ్ అరెక్” అనే నృత్యాలపై ఈ స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశారు.

***