Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళనాడు అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఇవాళ తమిళనాడు అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ప్రజల కృషి, పారిశ్రామిక నైపుణ్యం భారతదేశ పురోగతికి ఎంతో సహకరించినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. తయారీ రంగం, ఆటోమొబైల్స్, వస్త్ర పరిశ్రమ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్య రంగం, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల వరకు

ప్రతి రంగంలోనూ ఆవిష్కరణలు, నైపుణ్యం, పారిశ్రామిక ప్రతిభతో తమిళనాడు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందని కొనియాడారు.

“తమ సాంస్కృతిక గుర్తింపు, సంప్రదాయాల పట్ల తమిళనాడు ప్రజలు ఎంతో గర్విస్తారు. తమిళ సంస్కృతి దేశ నాగరికతా ప్రయాణాన్ని ఎన్నో విధాలుగా సుసంపన్నం చేసింది” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

తమిళనాడు అవతరణ దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు.

తమిళనాడు ప్రజల కృషి, పారిశ్రామిక నైపుణ్యం భారతదేశ పురోగతికి ఎంతో తోడ్పడింది. తయారీ రంగం, ఆటోమొబైల్స్, వస్త్ర పరిశ్రమ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్య రంగం, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల వరకు

ప్రతి రంగంలోనూ ఆవిష్కరణలు, నైపుణ్యం, పారిశ్రామిక ప్రతిభతో తమిళనాడు ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది.

తమ సాంస్కృతిక గుర్తింపు, సంప్రదాయాల పట్ల తమిళనాడు ప్రజలు ఎంతో గర్విస్తారు. తమిళ సంస్కృతి దేశ నాగరికతా ప్రయాణాన్ని ఎన్నో విధాలుగా సుసంపన్నం చేసింది.

 

ఈ శుభ సందర్భం తమిళనాడు ప్రజలందరి జీవితాల్లోనూ భవిష్యత్తులో ఆనందం, విజయాలు, నూతన అవకాశాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను.

***