పిఎంఇండియా
ద ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్, 1961 కు సవరణ చేయడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ చట్టంలో ఆరు కొత్త ఐ ఐ టి లను చేరుస్తారు. ఈ ఆరు కొత్త ఐ ఐ టి లను తిరుపతి (ఆంధ్ర ప్రదేశ్), పాలక్కాడ్ (కేరళ), ధార్వాడ్ (కర్ణాటక), భిలాయి (చత్తీస్ గఢ్), గోవా, జమ్మూ (జమ్ము& కశ్మీర్) లలో ఏర్పాటు చేస్తారు; ఇంకా, ధన్‌బాద్ లోని ఐ ఎస్ ఎమ్ ను ద ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్, 1961 పరిధిలోకి వచ్చే ఐ ఐ టి గా మార్చుతారు.
పైన ప్రస్తావించిన మేరకు కొత్త ఐ ఐ టి ల ఏర్పాటుకు వీలుగా ద ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్, 1961ను సవరించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
మంత్రిమండలి ఆమోదం లభించండంతో ఆరు కొత్త ఐ ఐ టి లు ద ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్, 1961 పరిధి లోకి వస్తాయి. వాటిని జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ప్రకటిస్తారు. ధన్‌బాద్ లోని ఐ ఎస్ ఎమ్ ను ఐ ఐ టి గా మార్చడంతో పాటు, ఆ సంస్థను జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఐ ఐ టి గా ప్రకటించడానికి కూడా ఈ సవరణ వీలు కల్పిస్తుంది.