Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దిన అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి; ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దిన అభినందనలు. రానున్న కాలంలో ఈ రాష్ట్రం పురోగతి మరియు సమృద్ధి బాటలో సాగాలని నేను ప్రార్థిస్తున్నాను.

ఆంధ్ర ప్రదేశ్ యొక్క చురుకైన ప్రజలకు ఇవే నా శుభాకాంక్షలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో నూతన శిఖరాలను అందుకోవాలిగాక. అంతే కాకుండా, భారతదేశ పురోభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఉండుగాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.