పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర స్థాపక దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు కూడా తన శుభాకాంక్షలు తెలియజేశారు.
“తెలంగాణ స్థాపక దినం సందర్భం లో, ఈ అద్భుతమైన రాష్ట్రం యొక్క ప్రజల కు ఇవే నా శుభాకాంక్షలు. కష్టించి పని చేసే పౌరుల కు తెలంగాణ మారు పేరు గా ఉంది. వారు మన దేశాభివృద్ధి కి గొప్ప తోడ్పాటు ను అందిస్తున్నారు. తెలంగాణ పురోగతి పథం లో సాగాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.
ఆంధ్ర ప్రదేశ్ యొక్క ప్రియమైన నా సోదరీమణుల కు మరియు సోదరుల కు ఇవే శుభాకాంక్షలు. విజ్ఞాన శాస్త్రం మొదలుకొని క్రీడల వరకు, విద్య మొదలుకొని వ్యాపార సంస్థ ల వరకు ఆంధ్ర ప్రదేశ్ యొక్క తోడ్పాటు ఎంతగానో ఉంది. ఈ రాష్ట్రం రానున్న సంవత్సరాల లో సమృద్ధి చెందుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
On Telangana’s Statehood Day, my best wishes to the people of this wonderful state. Telangana is known for its hardworking citizens who are making great contributions to our nation’s development. I pray for the progress of Telangana.
— Narendra Modi (@narendramodi) June 2, 2019