Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దంతవైద్యుల (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2017 ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


దంతవైద్యుల (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2017 ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం త‌న ఆమోదాన్ని తెలిపింది. అయితే ఇది దంతవైద్యుల చ‌ట్టం, 1948 (16 ఆఫ్ 1948)లో లెజిస్లేటివ్ డిపార్ట్ మెంటు అవ‌స‌ర‌మ‌ని భావించే ఏదైనా స‌వ‌ర‌ణతో కూడిన లేదా త‌త్పర్య‌వ‌సాన ప్ర‌భావంతో కూడిన ముసాయిదా ర‌చ‌న‌లోని మార్పులకు లోబ‌డి ఉంటుంది. ఈ స‌వ‌ర‌ణ అనావ‌శ్య‌త‌ను త‌గ్గించ‌గ‌లుగుతుంది.

స‌వ‌రించ‌బోయే క్లాజుల‌లో దంతవైద్యుల చ‌ట్టం, 1948 లోని ప్రొవిజన్ ల‌లో కొన్ని మార్పుల‌కు సంబంధించిన ఈ కింది అంశాలు..

1. సెక్ష‌న్ 3 కు సంబంధించిన (ఎఫ్‌) క్లాజ్ లోని డెంట‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క స‌భ్య‌త్వం మ‌రియు

2. పైన పేర్కొన్న చ‌ట్టంలోని 21వ సెక్ష‌న్ (బి) క్లాజు మ‌రియు 23వ సెక్ష‌న్ (బి) క్లాజుల ప‌రిధి లోని స్టేట్ అండ్ జాయింట్ స్టేట్ డెంట‌ల్ కౌన్సిల్స్ యొక్క స‌భ్య‌త్వం లకు సంబంధించినవి.. కలిసి ఉంటాయి.

పూర్వ‌రంగం:

ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న చ‌ట్టం ప్ర‌కారం, దంత వైద్యులు డెంట‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లోని పార్ట్ – బి లో కేంద్ర ప్ర‌భుత్వ నామినీలుగా రిజిస్ట‌రై ఉండాలి. అలాగే, పార్ట్ – బి నుండి న‌లుగురు/ఇద్ద‌రు స‌భ్యులు చొప్పున.. స్టేట్ /జాయింట్ స్టేట్ డెంట‌ల్ కౌన్సిల్స్‌ కు ఎన్నికవ్వాలి. అయితే, ఇది త‌న ఔచిత్యాన్ని కోల్పోయింది. వారి ప్రాతినిధ్యం తాలూకు వ్య‌వ‌స్థ‌ల అనావ‌శ్య‌క‌త‌ను త‌గ్గించాలనే దృష్టి కోణంలో నుండి ప‌రిశీలించిన కేంద్ర ప్ర‌భుత్వం, ఈ ప్రొవిజన్ లను తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. ఇలా చేసినందువ‌ల్ల వారి ప్రాతినిధ్యం ఇక‌ మీదట త‌ప్ప‌నిస‌రి ఏమీ కాబోదు.

 

***