పిఎంఇండియా
అండమాన్ మరియు నికోబార్ దీవుల (మ్యునిసిపల్) సవరణ నియమాలు, 2018.. వీటి అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
దిగువన ప్రస్తావించిన వాటి అమలు ప్రతిపాదనలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దమన్ మరియు దీవ్ పురపాలక సంఘాల (సవరణ) నియమాలు, 2018;
దాద్ రా మరియు నాగర్ హవేలీ మ్యునిసిపల్ కౌన్సిల్ (సవరణ) నియమాలు, 2018; మరియు
అండమాన్ మరియు నికోబార్ దీవుల (మ్యునిసిపల్) సవరణ నియమాలు, 2018.
ప్రభావం:
ఈ రెగ్యులేశన్ లు కేంద్ర పాలిత ప్రాంతాలైన దమన్ మరియు దీవ్, దాద్ రా మరియు నాగర్ హవేలీ, ఇంకా అండమాన్ మరియు నికోబార్ దీవుల లోని పురపాలక సంఘాల ఏర్పాటు, పరిపాలన, మరియు అధికారాలకు సంబంధించి మెరుగైన నిబంధనలను తీసుకురావడంలో తోడ్పాటునిస్తాయి.
వివరాలు:
ఫిరాయింపుల నిరోధానికి, నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానానికి, అంబడ్స్‌మన్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను క్రమానుగతంగా ‘‘దమన్ మరియు దీవ్ పురపాలక సంఘాల నియమాలు, 1968’’లోను, ‘‘దాద్ రా మరియు నగర్ హవేలీ మ్యునిసిపల్ కౌన్సిల్ నియమాలు, 2004’’ లోను, ఇంకా ‘‘అండమాన్ మరియు నికోబార్ దీవుల (మ్యునిసిపల్) నియమాలు, 1994’’లోను చేర్చనున్నారు.
ఈ నియమాలలో..
(i) వలస పాలన కాలం నాటి ప్రస్తావన అయిన ‘సర్వెంట్’ (సేవకుడు) అనే పదం స్థానంలో ‘ఎంప్లాయీ’ (ఉద్యోగి) అనే పదాన్ని చేర్చడం, (ii) ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల ద్వారా ఓటింగుకు సంబంధించిన నిబంధన, (iii) సిసిఎస్ (సిసిఎ) నియమాలు, 1965 ని పెనాల్టీ ప్రొసీడింగ్స్‌కు వర్తింపచేయడం, ఇంకా (iv) అనేక సంవత్సరాల క్రితం ఖరారు చేసినటువంటి జరిమానా మొత్తాలను సవరించడం
వంటి మరికొన్ని సవరణలను కూడా..
చేర్చారు.