Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దావోస్ కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన‌ ప్ర‌క‌ట‌న‌


ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దావోస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

“దావోస్ లో జరుగనున్న డ‌బ్ల్యుఇఎఫ్ కు భార‌త‌దేశపు మంచి మిత్రుడు మ‌రియు వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ (డ‌బ్ల్యుఇఎఫ్‌) వ్య‌వ‌స్థాప‌కుడు అయిన ప్రొఫెస‌ర్ క్లావుస్ శ్వాబ్ ఆహ్వానించిన మీద‌ట, నేను తొలిసారి పర్యటించేందుకుగాను ఆస‌క్తితో ఎదురుచూస్తున్నాను. ఈ ఫోర‌మ్ తాలూకు ఇతివృత్తం ‘‘క్రియేటింగ్ ఎ శేర్డ్ ఫీచ‌ర్ ఇన్ ఎ ఫ్రాక్చ‌ర్ డ్ వ‌ర‌ల్డ్‌’’ తగినది కావడంతో పాటు ఆలోచ‌న‌ల‌ను రేకెత్తించేదిగా కూడా ఉంది.

స‌మ‌కాలీన అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌కు మ‌రియు ప్ర‌పంచ పాల‌క స్వ‌రూపానికి ప్ర‌స్తుతం ఎదుర‌వుతున్న సవాళ్లు మరియు మున్ముందు ఎదురవగల స‌రికొత్త స‌వాళ్ళు అనేవి ప్ర‌పంచ‌ వ్యాప్తంగా నాయ‌కులు, ప్ర‌భుత్వాలు, విధాన రూప‌క‌ర్త‌లు, కార్పొరేట్లు మ‌రియు పౌర స‌మాజాలు ప్రముఖంగా శ్రద్ధ వహించవలసిన అవ‌స‌రం ఎంతైనా ఉన్నటువంటి సవాళ్లుగా ఉన్నాయి.

ఇటీవ‌ల కొన్ని సంవత్సరాలలో బ‌య‌టి ప్ర‌పంచంతో భార‌త‌దేశం సంబంధాలు అనేవి రాజ‌కీయాలు, ఆర్థికం, ప్ర‌జ‌ల‌కు- ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంబంధాలు, భ‌ద్ర‌త, ఇంకా త‌దిత‌ర రంగాలను క‌లుపుకొని బ‌హుళ పార్శ్వాల‌తో కూడుకొని ఉండడమే కాక నిజంగా ప్ర‌భావ‌వంతంగా మారాయి.

అంత‌ర్జాతీయ స‌ముదాయంతో భార‌త‌దేశం భావి సంబంధాలను గురించిన నా దార్శనిక‌త‌ను దావోస్ లో వ్య‌క్తం చేసేందుకు నేను వేచివున్నాను.

వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌తో పాటు స్విస్ కాన్ఫెడ‌రేశన్ అధ్య‌క్షులు, శ్రేష్ఠులైన శ్రీ అలైన్ బెర్సెత్ తో మ‌రియు స్వీడ‌న్ ప్ర‌ధాని, శ్రేష్ఠులైన శ్రీ స్టీఫన్ లోఫ్‌ వెన్ తో విడి విడిగా ద్వైపాక్షిక స‌మావేశాలు జ‌ర‌ప‌డం కోసం కూడా నేను ఎదురుచూస్తున్నాను.

ఈ ద్వైపాక్షిక స‌మావేశాలు ఫలప్రదం అవుతాయని మరియు ఈ దేశాల‌తో మ‌న సంబంధాల‌కు ఒక ఉత్తేజాన్ని ఇచ్చి ఆర్థిక సంబంధాల‌ను మరింతగా బలపరుస్తాయ‌ని నేను న‌మ్ముతున్నాను”.

***