Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాలను 15 శాతం రాయితీతో స్ధానిక మార్కెట్ లో అమ్మడం వల్ల జాతీయ వ్యవసాయ సహకార వాణిజ్య సంస్ధ, ప్రాజెక్ట్ మరియు సామాగ్రి సంస్ధ, రాష్ట్రీయ వ్యాపార సంస్థ, లోహలు, ఖనిజాల వాణిజ్య సంస్థలకు వచ్చిన నష్టాలను భర్తీ చేయనున్న ప్రభుత్వం


జాతీయ వ్యవసాయ సహకార వాణిజ్య సంస్ధ, ప్రాజెక్ట్ మరియు సామాగ్రి సంస్ధ, రాష్ట్రీయ వ్యాపార సంస్థ, లోహలు, ఖనిజాల వాణిజ్య సంస్థలకు, దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాలను 15 శాతం రాయితీతో స్ధానిక మార్కెట్ లో అమ్మడం వల్ల 2006-2011 సంవత్సరాల మధ్య సంభవించిన నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర వినియోగం, ప్రజా పంపిణీ ఆహార మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 113.40 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఆమోదముద్ర వేసింది. పప్పు ధాన్యాలను రాయితీ గడువు ముగిసిన తరువాత కూడా మరో ఆరు నెలలు 15 శాతం రాయితీతో మార్కెట్ లో అమ్మడం వల్ల ఈ నష్టం వచ్చిందని, ఈ రాయితీ వల్ల కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థ వేగం పెరగడంతో పాటు మార్కెట్ లో ధరలు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది.

వినియోగదారుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థ మరియు జాతీయ లోహలు, ఖనిజాల వాణిజ్య సంస్థ కలసి 5000 టన్నుల కందిపప్పు, 5000 వేల టన్నుల మినపప్పు ను రిటైల్ మార్కెట్ లోకి దిగుమతి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నయి. సెప్టెంబర్ 5 , 2015 కల్లా కందిపప్పు ను మొదటి విడతగా ముంబైకి దిగుమతి అవుతుంది.

నిత్యవసర వస్తులను అందుబాటులోకి తేవడానికి, ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్రాలకు నిత్యవసర వస్తువులైన పప్పు ధాన్యాలు, ఉల్లిగడ్డల దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. అలాగే పప్పు దినుసుల నిలువలపై పరిమితి అధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పింది. కాబుల్ చనా, సేంధ్రీయ పప్పులు మినహా మిగతా పప్పు ధాన్యాల ఎగుమతులను 10 వేల మిలియన్ టన్నులకు మించి కేంద్రం రద్దు చేసింది.