పిఎంఇండియా
దీర్ఘకాలిక వీసా (ఎల్ టి వి)పై భారతదేశంలో ఉంటున్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు చెందిన హిందూ, సిక్కు, బౌద్ద, జైన, పారసీ, క్రైస్తవ వర్గాల వారికి పలు సౌకర్యాల కల్పన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ వర్గాల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతో మంత్రిమండలి ఈ మేరకు నిర్ణయించింది. ఈ కింద పేర్కొన్న సౌకర్యాలను వారికి కల్పించనున్నారు:-
అటువంటి వ్యక్తులకు పౌరసత్వం తీసుకోవడానికి వీలు కల్పించేందుకు గాను 2009 పౌరసత్వ నిబంధనలలో సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ నిబంధనలు ఈ కింది విధాలుగా ఉపకరించగలవు:-
|
1 |
ఛత్తీస్‌గఢ్ |
రాయ్‌పూర్ |
|
2 |
గుజరాత్ |
అహ్మదాబాద్, గాంధీనగర్ మరియు కచ్ఛ్ |
|
3 |
మధ్య ప్రదేశ్ |
భోపాల్, ఇండోర్ |
|
4 |
మహారాష్ట్ర |
నాగ్ పూర్, ముంబయ్, పుణే మరియు ఠాణే |
|
5 |
ఢిల్లీ |
పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ |
|
6 |
రాజస్తాన్ |
జోధ్ పూర్, జైసల్మేర్ మరియు జైపూర్ |
|
7 |
ఉత్తర్ ప్రదేశ్ |
లక్నో |
క్రమ సంఖ్య | రాష్ట్రం |
జిల్లాలు |
|---|
· భారతదేశ పౌరసత్వం కోసం అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ రుసుము ప్రస్తుతం రూ. 3,000-రూ.15,000 శ్రేణిలో ఉండగా, దీనిని రూ.100కు తగ్గించనున్నారు.
నేపథ్యం:
ఈ దేశాలకు చెందిన అల్పసంఖ్యాక వర్గాల వారు భారతదేశంలో నివాసం ఉండేటందుకు ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలోను అనేక చర్యలు తీసుకొంది. అయితే, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వ్యక్తులైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పారసీలు, క్రైస్తవులు దీర్ఘకాలిక వీసా పై భారతదేశంలో ఉంటూ వారి జీవనానికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంత్రిమండలి తాజా నిర్ణయం వారు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను దూరం చేయడంలో తోడ్పడేదే అవుతుంది.