Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దుబాయి పాల‌కుడి కుమారుడి మ‌ర‌ణంపై ప్ర‌ధాని సంతాపం


యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.) ఉపాధ్య‌క్షుడు, ప్ర‌ధాని, దుబాయి పాల‌కుడైన శ్రీ షేక్ మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్త‌మ్ కుమారుడు శ్రీ షేక్ ర‌షీద్ బిన్ మ‌హ్మ‌ద్ అల్ మ‌క్త‌మ్ మృతికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ మేర‌కు శ్రీ షేక్ మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్త‌మ్‌కు ప్రధాని మోదీ లేఖ‌ను రాశారు. ” మీ కుమారుడు శ్రీ షేక్ ర‌షీద్ బిన్ మ‌హ్మ‌ద్ అల్ మ‌క్త‌మ్ హ‌ఠాన్మ‌ర‌ణం న‌న్ను బాధించింది. ఈ దుఃఖ స‌మ‌యంలో మీకు, మీకు కుటుంబ స‌భ్యుల‌కు, యూఏఈ ప్ర‌జ‌ల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నాను. యూఏఈ సోద‌ర‌, సోద‌రీమ‌ణుల దుఃఖంలో భార‌త ప్ర‌జ‌లు పాలుపంచుకుంటున్నారు ” అని ప్ర‌ధాన మంత్రి త‌న లేఖ లో పేర్కొన్నారు.