Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశం తెలుసుకోగోరుతోంది అనే స్థాయి నుండి దేశాని కి అగ్ర‌తాంబూలం స్థాయి కి భార‌త‌దేశం ప‌రివ‌ర్త‌న చెందింది: ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఇక్క‌డ జ‌రిగిన రిప‌బ్లిక్ స‌మిట్ లో ప్ర‌ధానోప‌న్యాస‌ం చేశారు. ఈ సంవ‌త్స‌రం లో జ‌రిగిన ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నాని కి ‘‘ఇండియాస్ మోమెంట్ నేశ‌న్ ఫ‌స్ట్‌’’ అనే అంశం ఇతివృత్తం గా ఉండింది.

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, తెలుసుకోగోరుతున్న దేశం స్థాయి నుండి దేశానికే అగ్ర‌తాంబూలం అనే స్థాయి కి భార‌త‌దేశం మార్పు చెందింద‌న్నారు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాన‌టువంటివి ప్ర‌స్తుతం ప‌రిష్కారం అయ్యాయ‌ని కూడా ఆయ‌న అన్నారు. రెండు కార‌ణాల రీత్యా- భార‌త‌దేశపు ఆవశ్యకత మ‌రియు దేశాని కి పెద్ద పీట అని 130 కోట్ల మంది ప్ర‌జ‌లు భావించ‌డం తో- ఇది సంభ‌వించింది అని ఆయ‌న చెప్పారు.

క‌శ్మీర్ లో 370వ అధిక‌ర‌ణం ర‌ద్దు విష‌య‌మై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఉగ్ర‌వాదం వెనుక ఉన్న‌టువంటి ప్ర‌ధాన హేతువు ను భార‌త‌దేశం ప‌రిహ‌రించింద‌న్నారు. జ‌మ్ము & క‌శ్మీర్ కు ప్ర‌త్యేక హోదా ను ఇచ్చిన‌టువంటి 370వ అధిక‌ర‌ణం రాజ్యాంగం లో ఒక తాత్కాలిక నిబంధ‌నేనని, అయితే ‘‘కొన్ని కుటుంబాల’’ వ‌ల్ల దీని ని శాశ్వ‌త నిబంంధన గా ప‌రిగ‌ణించార‌ని ఆయ‌న అన్నారు.

దేశాని కి అగ్ర ప్రాధాన్యం ఉన్న‌ప్పుడు దేశం ప్ర‌ధాన నిర్ణయాన్ని తీసుకొంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌రి అటువంటి నిర్ణ‌యాన్ని దేశం అంగీక‌రించిన‌ప్పుడు జాతి ముంద‌డుగు వేస్తుంద‌ని చెప్పారు. ‘ఆధార్’కు చ‌ట్ట‌బ‌ద్ధ గుర్తింపు ద‌క్క‌కుండా ఉండాలని కొంద‌రు వ్య‌క్తులు స‌ర్వోన్న‌త న్యాయ‌ స్థానాన్ని ఆశ్ర‌యించార‌ని కూడా ఆయ‌న అన్నారు. ఈ వ్య‌క్తులు ఆధార్ ను అప‌ఖ్యాతి పాలు చేయ‌డాని కి వారి యొక్క సర్వ శక్తి ని ధార‌పోశారు. అయితే, వారి యొక్క నిజ రూపాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం లో ‘ఆధార్’ ఎంత‌గానో స‌హాయ‌ప‌డింది. ఇది దాదాపు 1.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అన‌ర్హుల పాలు కాకుండా కాపాడింది. ప్ర‌తి సంవ‌త్స‌రం దాదాపు దీని కి స‌మాన‌మైన సొమ్ము అన‌ర్హుల చేతుల లోకి వెళ్తోంది, మ‌రి దీని ని అడ్డుకొనే వారు ఎవ్వ‌రూ లేక‌పోయారు. వ్య‌వ‌స్థ లోని ఈ భారీ దారి మ‌ళ్ళింపు ను అడ్డుకొనే ప‌ని ని మేము చేశాము, దీని కి కార‌ణం మాకు భార‌త‌దేశ‌మే అగ్ర ప్రాధాన్యం కల‌ది కావ‌డ‌మే అని ఆయన అన్నారు.

ఇది వ‌ర‌కు దేశం లో జిఎస్‌టి ని ఎన్న‌డూ అమ‌లు చేయ‌లేక‌పోయారు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌స్తుతం సామాన్య పౌరుల‌ కు సంబంధించినంత వ‌ర‌కు 99 శాతం వ‌స్తువుల పై మునుప‌టి తో పోలిస్తే స‌గ‌టు న స‌గం ప‌న్ను విధింప‌బ‌డుతోందని చెప్పారు. రిఫ్రిజిరేట‌ర్ లు, మిక్స‌ర్ లు, జ్యూస‌ర్ లు, వాక్యూం క్లీన‌ర్లు, గీజర్ లు, మొబైల్ ఫోన్ లు, వాషింగ్ మశీన్ లు, గ‌డియారాలు.. వీట‌న్నింటి పై 31 శాతాని కి మించి ప‌న్ను విధించిన కాలమంటూ ఒక‌టి ఉండేది. ప్ర‌స్తుతం, ఈ వ‌స్తువుల‌న్నింటి మీద ప‌న్ను ను సుమారు 10 నుండి 12 శాతాని కి త‌గ్గించ‌డ‌మైంద‌న్నారు.

ఢిల్లీ లో చ‌ట్ట వ్య‌తిరేక‌మైన కాల‌నీ ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ ను గురించి ఆయ‌న మాట్లాడుతూ, ల‌క్ష‌లాది కుటుంబాల జీవితాల లో ద‌శాబ్దాలు గా బోలెడంత అనిశ్చితి నెల‌కొంది. ప్ర‌జ‌లు వారి యొక్క క‌ష్టార్జితం తో ఇక్క‌డ ఇళ్ళ ను కొనుగోలు చేసేవారు, కానీ వారు వాటి ని పూర్తి గా సొంతం చేసుకోలేక‌పోయే వారు అని ఆయ‌న వివరించారు. ఈ స‌మ‌స్య‌లు ఎల్ల‌ప్ప‌టికీ అలాగే కొనసాగాయి. మా ప్ర‌భుత్వం దీని ని ముగించాల‌ని నిర్ణ‌యించింది. మ‌రి, ప్ర‌స్తుతం 50 ల‌క్ష‌ల మంది కి పైగా ఢిల్లీ నివాసులు వారి ఇంటి విష‌యం లో న‌మ్మ‌కాన్ని/ఆశ‌ ను/విశ్వాసాన్ని మ‌రియు ఒక మెరుగైన జీవనాన్ని పొందారు. ఇది మ‌న మ‌ధ్యత‌ర‌గ‌తి కి త‌ప్ప‌క మేలు చేకూర్చేదే అవుతుంది. వారు కలగన్న గృహాన్ని వారు సొంతం చేసుకోవ‌డం లో ఇది తోడ్ప‌డుతుంది అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

భార‌త‌దేశం లో ఈ రోజు న ప‌నులు జ‌రుగుతూ ఉన్న‌టువంటి ప‌రిమాణం మ‌రియు వేగం ఇదివ‌ర‌కు ఎరుగ‌నటువంటివి గా ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి వ‌క్కాణించారు. 60 నెల‌ల కాలం లో దాదాపు గా 60 కోట్ల మంది భార‌తీయుల కు టాయిలెట్ సౌక‌ర్యాల ను క‌ల్పించ‌వ‌ల‌సివుంది. దేశాని కి పెద్ద పీట వేసిన‌ప్పుడు మాత్ర‌మే ఈ త‌ర‌హా ప్ర‌ణాళిక‌ల ను మ‌రియు కార్య‌క్ర‌మాల ను ఆలోచించి అమ‌లు ప‌ర‌చ‌డం సాధ్య‌మ‌వుతుందని ఆయ‌న చెప్పారు.

మీరు స్వార్ధాన్ని వీడి, ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌ర్ధ‌న ను అందుకొని, ప్ర‌తి ఒక్క‌రి న‌మ్మ‌కాన్ని మ‌రియు ప్ర‌తి ఒక్క‌రి అభివృద్ధి ని రాజ‌కీయాల యొక్క, విధానం యొక్క ప్రాతిప‌దిక గా మ‌ల‌చుకోవాలి. ఇలా ఆలోచించడం అభివృద్ధి ప‌రుగు లో మ‌న‌ల‌ను వెనుక‌ప‌ట్టు న నిలిపింది. దేశం లోని 112 ఆకాంక్ష‌భ‌రిత జిల్లాల విష‌యం లో నూత‌న పంథాల లో ఎలా కృషి చేయాలో నేర్చుకొంటున్నాము అని ఆయ‌న తెలిపారు.

దేశాని కి అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వాల‌న్న స్ఫూర్తి పేద‌ల‌ ను బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ తో జోడించేందుకు 37 కోట్ల కు పైగా బ్యాంకు ఖాతాల ను తెరిపించింద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. దేశాని కి అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వాల‌న్న ఈ ఆలోచ‌నే జ‌ల్ జీవ‌న్ మిశ‌న్ ను ఆరంభించింది. రానున్న కాలం లో దాదాపు గా 3.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ను ఈ అభియాన్ కోసం వెచ్చించ‌డం జ‌రుగుతుంది. దీని ద్వారా దేశం లోని మారుమూల ప్రాంతాల ప్ర‌జ‌లు ప‌రిశుభ్ర‌మైన త్రాగునీటి ని అందుకోగ‌లుగుతారు. ప్ర‌తి ఒక్క ఇంటి కి నీరు అందుతుంది అని ఆయ‌న అన్నారు.

వారి ఆదాయాన్ని పెంచే ఉద్దేశ్యం తో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ను 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ క‌లిగింది గా తీర్చిదిద్దాల‌న్న ల‌క్ష్యాన్ని దేశం నిర్దేశించుకోవ‌డం జ‌రిగింది అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. దేశాని కి అగ్ర ప్రాధాన్యం అనే స్ఫూర్తి తో ప‌ని చేయ‌డాన్ని తాను న‌మ్ముతున్న‌ట్టు ఆయ‌న చెప్తూ, ప్ర‌తి ఒక్క నిర్ణ‌యం తాలూకు స‌రి అయినటువంటి ఫ‌లితాన్ని మ‌నం పొందుతాము. మ‌రి దేశం కూడాను ప్ర‌తి ఒక్క ల‌క్ష్యాన్ని సాధిస్తుంది అని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తి తో ‘న్యూ ఇండియా’ తాలూకు క్రొత్త అవ‌కాశాలు, వినూత్న సాధ్యాల పై ఒక కూలంక‌ష చ‌ర్చ జ‌రుగుతుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.