Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశం యొక్క స‌మ‌స్య‌ల కు సుల‌భ ప‌రిష్కార మార్గాల‌ ను అన్వేషించవ‌ల‌సింద‌ని విద్యార్థుల ను కోరిన ప్రధాన మంత్రి


ఐఐటి చెన్నై లో ఈ రోజు తో ముగిసిన 36 గంట ల ‘సింగ‌పూర్ – ఇండియా హ్యాక‌థ‌న్’ విజేత‌ల‌ కు బ‌హుమ‌తుల‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌దానం చేశారు.

ఈ హ్యాక‌థ‌న్ భార‌త ప్ర‌భుత్వ ఐఐటి, చెన్నై సింగ‌పూర్ ప్ర‌భుత్వం మ‌రియు సింగ‌పూర్ కు చెందిన నాన్ యాంగ్ టెక్నిక‌ల్ యూనివ‌ర్సిటీ (ఎన్ టియు) ల స‌హ‌కారం తో ఏర్పాటైన ఇటువంటి రెండో హ్యాక‌థ‌న్.

ఒక‌టో హ్యాక‌థ‌న్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌తిపాదించిన‌టువంటి ఒక ఆలోచ‌న ఆధారం గా సింగ‌పూర్ లోని ఎన్‌టియు లో 2018వ సంవ‌త్స‌రం లో నిర్వ‌హించ‌డ‌మైంది.

విద్యార్థులు మ‌రియు విద్యావేత్తల బృందాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, హ్యాక‌థ‌న్ విజేత‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘మిత్రులారా, హ్యాక‌థ‌న్ విజేత‌ల ను నేను శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నాను. ఇక్క‌డ గుమికూడిన ప్ర‌తి ఒక్క యువ నేస్తాన్ని, ప్ర‌త్యేకించి నా విద్యార్థి మిత్రుల ను అభినందిస్తున్నాను. స‌వాళ్ళ కు ఎదురొడ్డి నిల‌చేందుకు మీ సుముఖ‌త‌, అలాగే ఆచ‌ర‌ణీయమైన ప‌రిష్కార మార్గాల‌ ను క‌నుగొనాల‌న్న మీలోని ఇచ్ఛ‌, మీ లోపలి శ‌క్తి, మీలోని ఉత్సుక‌త.. ఇవే పోటీ లో కేవ‌లం గెలిచే క‌న్నా ఎంతో అధిక విలువ ను క‌లిగిన‌టువంటివి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

స్టార్ట్-అప్ సానుకూల స్థితి గ‌తులు కొలువుదీరిన 3 అగ్ర‌గామి దేశాల లో ఒక‌ దేశం గా భార‌త‌దేశం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. గ‌డ‌చిన 5 సంవ‌త్స‌రాల లో ఇంక్యుబేశ‌న్ కు మ‌రియు ఇన‌వేశ‌న్ కు భార‌త‌దేశం ఎనలేని ప్రాముఖ్యాన్ని క‌ట్ట‌బెట్టినట్లు ఆయ‌న తెలిపారు.

‘‘అట‌ల్ ఇన‌వేశ‌న్ మిశ‌న్, పిఎమ్ రిస‌ర్చ్ ఫెలోషిప్‌ స్‌ , స్టార్ట్-అప్ ఇండియా అభియాన్ ల వంటి కార్య‌క్ర‌మాలు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల సంస్కృతి ని ప్రోత్స‌హించేట‌టువంటి ఒక భారతదేశం.. 21వ శతాబ్ధ‌పు భార‌త‌దేశాని.. కి పునాది రాళ్ళు గా ఉంటాయి. మేము ప్ర‌స్తుతం మశీన్ లర్నింగ్‌, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్‌, బ్లాక్ చైన్ త‌దిత‌ర అధునాత‌న సాంకేతిక విజ్ఞానం మ‌న విద్యార్థుల కు చాలా ముందుగానే, అంటే ఆరో త‌ర‌గ‌తి స్థాయి లోనే అల‌వ‌రచాల‌ని మేము ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. పాఠ‌శాల విద్య మొదలుకొని ఉన్న‌త విద్య లో ప‌రిశోధ‌న వ‌ర‌కు నూత‌న ఆవిష్క‌ర‌ణ సాధ‌నం గా మారేట‌టువంటి ఒక ఇకో సిస్ట‌మ్ ను రూపొందించ‌డం జ‌రుగుతోంది’’ అంటూ ఆయ‌న వివ‌రించారు.

భార‌త‌దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల కు సుల‌భ‌మైన ప‌రిష్కార మార్గాల ను అన్వేషించ‌వ‌ల‌సింది గా విద్యార్థుల ను ప్ర‌ధాన మంత్రి కోరుతూ, భార‌త‌దేశం త‌న ప‌రిష్కార మార్గాల ను ప్ర‌పంచానికంత‌టికీ, ప్ర‌త్యేకించి అత్యంత పేద దేశాల ప్ర‌జ‌ల, చెంత‌ కు చేర్చాల‌నుకుంటోంది అన్నారు.

‘‘రెండు స్థూల కార‌ణాల రీత్యా ఇంక్యుబేశ‌న్ ను మ‌రియు ఇన‌వేశ‌న్ ను మేము ప్రోత్స‌హిస్తున్నాము. ఒక‌టో కార‌ణం – మేము భార‌త‌దేశం లో ప్ర‌జ‌ల జీవ‌నాన్ని స‌ర‌ళ‌తరం గా మార్చ‌డం కోసం వారి యొక్క స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించే సుల‌భ‌మైన ప‌రిష్కార మార్గాల ను కోరుకొంటున్నాము. రెండో కార‌ణం – యావ‌త్తు ప్ర‌పంచాని కి ప‌రిష్కార మార్గాల ను అన్వేషించాల‌ని భార‌త‌దేశం లోని మ‌న‌ము అపేక్షిస్తున్నాము. ఇండియ‌న్ సొల్యూశన్స్ ఫ‌ర్ గ్లోబ‌ల్ అప్లికేశ‌న్స్- ఇదే మ‌న నిబ‌ద్ధ‌త మ‌రియు మ‌న యొక్క ల‌క్ష్యం. మ‌న ఆచ‌ర‌ణీయ ప‌రిష్కారాలు పేద దేశాల అవ‌స‌రాల కు ప‌ని కి వ‌చ్చేవి గా అందుబాటులోకి రావాల‌ని కూడా మేము ఆశిస్తున్నాము. తీవ్ర నిరాద‌ర‌ణ కు గురైన వ‌ర్గాలు, నిరు పేద‌లు – వారు ఎక్క‌డ నివ‌సిస్తున్న‌ప్ప‌టి కీ కూడాను – వారి కి భార‌తీయ నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లు ఆలంబన ను ఇవ్వాలి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌ధాన మంత్రి ఐఐటి-ఎమ్ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మం లో మరియు స్వ‌ర్ణోత్స‌వాల లో పాలు పంచుకోనున్నారు.