Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ పండుగలు జరుపుకొంటున్న వేళ వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని వేరు వేరు ప్రాంతాలలో ప్రజలు బైసాఖి, వైశాఖాది, మాసాది, బోహాగ్ బిహు, పోయిలా బోయిసాఖ్, విశు, మహా విశుబ సంక్రాంతి, మరియు పూత్తాండు పర్వదినాలను జరుపుకొంటున్న వేళ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పండుగలు మానవాళికి సంతోషాన్ని, సౌభాగ్యాన్ని కొనితేవాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

“రానున్న సంవత్సరం ప్రజల అభిలాషలకు రెక్కలు తొడగాలి.. మరీ ప్రత్యేకించి యువతీయువకుల ఆశలకు చోదకంగా నిలవాలి. అలాగే, అందరిలో సామరస్య భావనను వ్యాపింపచేయాలి, ఆనందాన్ని నింపాలి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***