Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ ‘ప్ర‌ధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజ‌న’ మరియు తక్కు ఖర్చులో పూర్తి అయ్యే కార్డియేక్ స్టెంట్ లు, ఇంకా మోకాలి శస్త్రచికిత్స ల యొక్క ల‌బ్ధిదారుల‌తో జూన్ 7 వ తేదీన చర్చించనున్న ప్ర‌ధాన మంత్రి


దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి ‘ప్ర‌ధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజ‌న’ (పిఎమ్ బిజెపి) మరియు తక్కు ఖర్చులో పూర్తి అయ్యే కార్డియేక్ స్టెంట్ లు, ఇంకా మోకాలి శస్త్రచికిత్సల యొక్క ల‌బ్ధిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జూన్ 7 వ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా చర్చించనున్నారు.

ఈ కార్యక్రమాలు రోగుల జీవితాలలో, ప్రత్యేకించి పేదల జీవితాలలో, ఏ విధమైనటువంటి మార్పులను తీసుకువచ్చిందీ తెలుసుకోవడంతో పాటు వారి ప్రతిస్పందనను స్వయంగా గ్రహించాలన్నది కూడా ఈ చర్చ యొక్క ఉద్దేశంగా ఉంది.

ఈ చర్చ అంతా కూడా నమో యాప్ (NAMO App), యూట్యూబ్, ఫేస్ బుక్ తదితర వేరు వేరు సామాజిక మాధ్యమాలు వేదికలుగా సాగనుంది.

***