Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ‌వ్యాప్తంగా ఉన్న ముద్ర యోజ‌న ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి


దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి ముద్ర యోజ‌న లబ్ధిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజున సంభాషించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు చెందిన వివిధ లబ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రుపుతున్న సంభాష‌ణ‌ల ప‌రంప‌ర‌ లో ఇది రెండోది.

లబ్ధిదారుల‌తో సంభాషించ‌గ‌ల‌గ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి హర్షాన్ని వ్య‌క్తం చేస్తూ, ముద్ర యోజ‌న ఉద్యోగాల‌ను బ‌హుళం చేసేదిగా మారింద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మం వ‌డ్డీ వ్యాపారులు మ‌రియు మ‌ధ్య‌వ‌ర్తుల విష వ‌ల‌యం బారి నుండి న‌వ పారిశ్రామికులు ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డంలో స‌హాయ‌కారి అయ్యింద‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఇది యువతీయువకులకు, మ‌హిళ‌లకు మరియు సొంతంగా వ్యాపారాన్ని మొద‌లుపెట్టద‌ల‌చుకొన్న వారికి, లేదా సొంత వ్యాపారాన్ని విస్త‌రించాలని కోరుకొన్న వారికి కొత్త అవ‌కాశాల‌ను క‌ల్పించిందని వివరించారు.

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న లో భాగంగా, ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు 5.75 ల‌క్ష‌ల కోట్ల విలువైన 12 కోట్ల రుణాల‌ను ఇచ్చింది. ఇందులో 28 శాతం రుణాల విలువ 3.25 ల‌క్ష‌ల కోట్ల రూపాయలు. వీటిని ప్రథమంగా ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు కాగోరిన వారికి ఇవ్వ‌డ‌ం జరిగింది. విత‌ర‌ణ చేసిన మొత్తం రుణాల‌లో 74 శాతం మంది లబ్ధిదారులు మ‌హిళ‌లే ఉన్నారు. మ‌రి అలాగే 55 శాతం రుణాల‌ను ఎస్‌సి/ఎస్‌టి ఇంకా ఒబిసి స‌ముదాయాల‌కు అంద‌జేయ‌డ‌మైంది.

పిఎమ్ఎమ్‌వై లబ్ధిదారుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఈ ప‌థ‌కం పేద‌ల జీవితాల‌లో పరివర్తన ను తీసుకువ‌చ్చింద‌న్నారు. చిన్న మ‌రియు సూక్ష్మ వ్యాపారాల‌కు స‌హాయ‌కారిగా ఉన్న ఈ ప‌థ‌కం ప్ర‌జ‌ల‌ను ఆర్థికంగా, సామాజికంగా బ‌ల‌ప‌ర‌చ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు వారు స‌ఫ‌లీకృతులు కావ‌డానికి ఒక వేదిక‌ ను ఏర్ప‌ర‌చింద‌ని ఆయన చెప్పారు.

స్వ‌తంత్రోపాధి ని క‌ల్పించ‌వలసిన అవసరం ఉందని ప్ర‌ధాన మంత్రి నొక్కిపలుకుతూ, స్వీయ ఉపాధిని క‌లిగివుండ‌డమ‌నేది ప్ర‌స్తుతం ఒక గ‌ర్వ‌కార‌ణ‌మైన విష‌యంగా ఉంద‌ని, మరి ఇదివ‌ర‌కు అసాధ్యంగా ఎంచిన అంశాల‌ను సైతం సుసాధ్యం చేసుకోవడం లో ప్ర‌జ‌ల‌కు దోహ‌దపడింద‌ని వివ‌రించారు.

ప్ర‌ధాన మంత్రి తో సంభాష‌ణ క్ర‌మంలో- గత కొన్ని సంవ‌త్స‌రాల కిందట ముద్ర యోజ‌న ను అమ‌లు ప‌ర‌చివున్నట్లయితే గ‌నక ఇది ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు వారి సొంత వ్యాపారాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డంలో స‌హాయ‌ప‌డివుండేద‌ని, అలాగే వ‌ల‌స‌లను చాలా వ‌ర‌కు నిలువ‌రించి ఉండేద‌ని- పేర్కొన్నారు.

ప్ర‌ధాన మంత్రి తో లబ్ధిదారులు మాట్లాడుతూ, ముద్ర యోజ‌న త‌మ‌కు ఏ విధంగా సొంత వ్యాపారాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డంలో స‌హాయ‌ప‌డిందీ, మరి త‌ద్వారా ఇత‌రుల‌కు ఉద్యోగాన్ని అందించ‌డంలో తోడ్ప‌డిందీ చెప్పుకొచ్చారు.

కార్పొరేటేత‌ర‌, వ్య‌వ‌సాయేత‌ర చిన్న / సూక్ష్మ సంస్థ‌ ల‌కు 10 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు రుణాల‌ను అందించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న (పిఎమ్ఎమ్‌వై) ప‌థ‌కాన్ని 2015 ఏప్రిల్ 8వ తేదీ నాడు ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. ఈ రుణాల‌ను పిఎమ్ఎమ్‌వై లో భాగంగా అందించే ముద్ర రుణాలు గా వ‌ర్గీక‌రించ‌డ‌మైంది. ఈ రుణాల‌ను వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్‌బి లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆప‌రేటివ్ బ్యాంకులు, ఎమ్ఎఫ్ఐ లు మ‌రియు ఎన్‌బిఎఫ్‌సి లు ఇస్తూ వ‌స్తున్నాయి.

******