Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ‌వ్యాప్తంగా మాతృత్వ ల‌బ్ధి కార్య‌క్ర‌మం అమ‌లుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం దేశ‌వ్యాప్తంగా మాతృత్వ ల‌బ్ధి కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌డానికి ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  ఈ ఆమోదం వ‌ల్ల ఈ కార్య‌క్ర‌మం ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒకటో తేదీ నుండి దేశం లోని అన్ని జిల్లాల్లో అమ‌లు కానున్న‌ది.  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 31న దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాతృత్వ ల‌బ్ధి కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు.

మాతృత్వ ల‌బ్ధి కార్య‌క్ర‌మం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ప‌లు విధాలా ల‌బ్ధి చేకూరుతుంది.  ప్ర‌స‌వానికి ముందు మరియు త‌రువాత మ‌హిళ‌లు తాము కోల్పోయే వేత‌నాల‌కు బ‌దులుగా ప్ర‌భుత్వం నుండి న‌గ‌దు రూపంలో స‌హాయం పొందుతారు.  త‌ద్వ‌ారా మ‌హిళ‌లు ఎలాంటి ఆదుర్దా లేకుండా ప్ర‌స‌వానికి ముందు మరియు  త‌రువాత విశ్రాంతి తీసుకోగలుగుతారు.  అంతే కాకుండా వారికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌ను పొందేందుకు వీలు ఉంటుంది.

ఈ కార్య‌క్ర‌మం కోసం 1-1-2017నుండి 31-3-2020 వ‌ర‌కు అయ్యే ఖర్చు ప్రతిపాద‌న రూ. 12, 661 కోట్లు.   ఇది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పంచుకుంటాయి.  ఈ కాలంలో అంటే 1-1-2017నుండి 31-3-2017వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వ వాటా రూ. 7932 కోట్లు.

కార్య‌క్ర‌మ ల‌క్ష్యం

  1. i) ప్ర‌స‌వానికి ముందు మరియు త‌రువాత మ‌హిళ‌లు కోల్పోయే వేత‌నాల స్థానంలో వారికి పాక్షికంగా ఆదాయం ల‌భించేలా చూడ‌డానికిగాను ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించ‌డం జ‌రిగింది. త‌ద్వారా వారు జీవించి ఉన్న త‌మ మొద‌టి బిడ్డను ప్ర‌స‌వించ‌డానికి ముందు మరియు త‌రువాత‌ గినంత‌గా విశ్రాంతి తీసుకోగ‌లుగుతారు.

 

  1. ii) న‌గ‌దు ప్రోత్సాహ‌కాలను ఇవ్వ‌డం వ‌ల్ల గ‌ర్భవ‌తుల‌, బాలింత‌ల వ్య‌వ‌హార‌ శైలిలో మార్పు వ‌స్తుంది. వారు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి ప్రాధాన్య‌మిస్తారు.  త‌ద్వారా దేశంలో పోష‌కాహార లేమితో క‌లిగే స‌మ‌స్య‌లు అంటే.. పెరుగుద‌ల లేక‌పోవ‌డం, మ‌ర‌ణాలు, ఇంకా ఇత‌ర స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ల‌క్ష్యిత గ్రూపు

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఉద్యోగాలు చేసే మ‌హిళ‌ల‌కు, ప‌బ్లిక్ సెక్ట‌ర్‌లో ప‌ని చేసే మ‌హిళ‌లకు ఈ కార్య‌క్ర‌మం వ‌ర్తించ‌దు.  ఇత‌ర కార్య‌క్ర‌మాల కింద ఇలాంటి ల‌బ్ధినే పొందుతున్న మ‌హిళ‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం వ‌ర్తించ‌దు.  వీరు కాఉండా మిగ‌తా అంద‌రూ గ‌ర్భ‌వ‌తుల‌కు, బాలింత‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం వ‌ర్తిస్తుంది.  గ‌ర్భ‌వ‌తుల‌కు, బాలింత‌ల‌కు వారి మొద‌టి బిడ్డ విష‌యంలో రూ. 5000ల‌ను మూడు వాయిదాల్లో ఎమ్ డ‌బ్ల్యుసిడి ఇస్తుంది.  మిగ‌తా న‌గ‌దు ప్రోత్సాహ‌కాన్ని మాతృత్వ ల‌బ్ధి కార్య‌క్ర‌మం కోసం అనుమ‌తి పొందిన నియ‌మాల ప్ర‌కారం ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న కార్య‌క్ర‌మాల ప్ర‌కారం ఆసుప‌త్రిలో ప్ర‌స‌వం అనంతరం ఇస్తారు.  మొత్తం మీద ఒక ల‌బ్ధిదారు స‌రాస‌రి రూ.6,000 పొందుతుంది.

నియ‌మాలు మరియు వాయిదాలు

ల‌బ్ధి దారులైన గ‌ర్భ‌వ‌తులు, బాలింత‌లు రూ.5000 న‌గ‌దు ప్రోత్స‌హ‌కాన్ని మూడు వాయిదాల్లో పొందుతారు.  కింద ప‌ట్టిక‌లో తెలిపిన ప్ర‌కారం వారికి చెల్లింపులు చేస్తారు.

మొద‌టి వాయిదా

·   ,  గ‌ర్భం దాల్చగానే పేరు న‌మోదు.

రూ. 1,000/-

రెండో వాయిదా

·   6 నెల‌ల గ‌ర్భం త‌రువాత క‌నీసం ఒక‌సారైనా వైద్య‌ ప‌రీక్ష‌

 రూ.2000

మూడో వాయిదా

·   బిడ్డ జ‌న‌నాన్ని రిజిస్ట‌ర్ చేయించాలి.

·   బిసిజి, ఒపిబి, డిపిటి, హెప‌టైటిస్- బి లేదా దానికి స‌మాన‌మైన‌/ ప‌రా త్నామ్నాయ టీకా వేయించి వుండాలి.

రూ ,2,000/-

న‌గ‌దు బ‌దిలీ నియ‌మాలు మొత్తం (రూ.ల‌లో)

 

 

మిగ‌తా న‌గ‌దు ప్రోత్సాహ‌కాన్ని అర్హ‌త‌ గ‌ల ల‌బ్ధిదారులు పొందుతారు.  మాతృత్వ ల‌బ్ధి కార్య‌క్ర‌మం కోసం అనుమ‌తి పొందిన నియ‌మాల ప్ర‌కారం ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న కార్య‌క్ర‌మాల ప్ర‌కారం ఆసుప‌త్రిలో ప్ర‌స‌వం త‌రువాత‌ ఇస్తారు.  మొత్తం మీద ఒక ల‌బ్ధిదారు స‌రాస‌రి రూ.6000 పొందుతుంది.

ల‌బ్ధి దారుల‌కు న‌గ‌దు బ‌దిలీ విధానం

న‌గ‌దు బ‌దిలీ అనేది డిబిటి విధానం ప్ర‌కార‌మే ఉంటుంది.

పూర్వరంగం:

గ‌ర్భ‌ స‌మ‌యంలోను, ప్ర‌స‌వ స‌మ‌యంలోను, ప్ర‌స‌వానంత‌రం ప్ర‌తి మ‌హిళకు అవ‌స‌ర‌మ‌య్యే ఆరోగ్య సంర‌క్ష‌ణ ఇవ్వాల‌నే సంక‌ల్పానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.  ప్ర‌తి శిశువు స‌మ‌యానికి టీకాలు పొందాలి.  అప్పుడే త‌ల్లి, శిశువులు ఆరోగ్య‌క‌రంగా వుంటారు.  మొద‌టి గ‌ర్భ‌మ‌నేది సాధార‌ణంగా ప్ర‌తి మ‌హిళ‌కు అనేక స‌వాళ్ల‌ను విసురుతుంది.  ప్ర‌తి మ‌హిళ అనేక ఒత్తిళ్ల‌కు గుర‌వుతుంది.  కాబ‌ట్టి గ‌ర్భం దాల్చిన మ‌హిళ విష‌యంలో సుర‌క్షితంగా ప్ర‌స‌వం కావాలనే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌డం జ‌రిగింది.  అంతే కాదు ఆమె మొద‌టి బిడ్డ‌కు కావల‌సిన టీకాలు ఈ కార్య‌క్ర‌మం ద్వారా అందుతాయి.  ఈ కార్య‌క్ర‌మం కార‌ణంగా గ‌ర్భ‌వ‌తులు, బాలింత‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌హార‌ శైలి మెరుగ‌వుతుంది. త‌ద్వారా త‌ల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండ‌గలుగుతారు.

***