Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ద‌క్షిణాసియా స‌ముద్ర ప్రాంతాల‌లో చ‌మురు, ర‌సాయ‌న కాలుష్యాన్ని ఎదుర్కొనే అంశంపై స‌హ‌కారానికి ఇండియా, ద‌క్షిణాసియా స‌హ‌కార ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క్ర‌మం మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశం, ద‌క్షిణాసియా స‌ముద్ర ప్రాంతంలో చ‌మురు, ర‌సాయ‌న కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఇండియా, ద‌క్షిణాసియా స‌హ‌కార ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క్ర‌మం మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు చేసేందుకు త‌మ ఆమోదం తెలిపింది.

ప్ర‌భావం…..

ఈ అవ‌గాహ‌నా ఒప్పందం, ఇండియాకు, ద‌క్షిణాసియా స‌ముద్ర ప్రాంత దేశాలైన బంగ్లాదేశ్‌, మాల్దీవులు, పాకిస్థాన్‌, శ్రీ‌లంక‌ల మ‌ధ్య స‌న్నిహిత స‌హకారం పెంపొందించేందుకు,ఈ ప్రాంతంలో స‌ముద్ర ప్రాంత ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించి కాపాడేందుకు ఉద్దేశించిన‌ది.

అమ‌లు…..

ఈ ఒప్పందం కింద ప్రాంతీయంగా చ‌మురు స‌ముద్రంలో ఒలికిపోయిన‌పుడు దానిని ఎదుర్కొనే అత్య‌వ‌స‌ర ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న అమ‌లుకు ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) అధీకృత జాతీయ అథారిటీగా, జాతీయ స్థాయిలో సంప్ర‌దించ‌వ‌ల‌సిన వ్య‌వ‌స్థ‌గా ఉంటుంది. అలాగే చ‌మురు, ర‌సాయ‌నాలు స‌ముద్ర ప్రాంతంలో ఒలికిపోయిన సంద‌ర్భంలో భార‌త ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇది స్పందిస్తుంది. అంతేకాకుండా స‌ముద్రంలో జ‌రిగే వివిధ ప్ర‌మాదాల స‌మ‌యంలో జాతీయ అత్య‌వ‌స‌ర స్పంద‌న స‌మ‌న్వ‌య కేంద్రాలుగా ,ఐసిజి మారీటైమ్ రెస్క్యూ కో ఆర్డినేష‌న్ సెంట‌ర్లు (ఎం.ఆర్‌.సి.సి)లు వ్య‌వ‌హ‌రిస్తాయి.

నేప‌థ్యం…..

ద‌క్షిణాసియా ప్రాంతంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్రోత్సాహం, యాజ‌మాన్యానికి, ప‌ర్యావ‌ర‌ణ విస్తృతికి ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌,ఇండియా, మాల్దీవులు, నేపాల్‌,పాకిస్థాన్‌,శ్రీ‌లంక దేశాలు 1982లో ఎస్‌.ఎ.సి.ఇ.పి వ్య‌వ‌స్థ‌ను శ్రీ‌లంక‌లో ఏర్పాటు చేశాయి. ఎస్‌.ఎ.సి.ఇ.పి అంత‌ర్జాతీయ మారీటైమ్ ఆర్గ‌నైజేష‌న్ ( ఐ.ఎం.ఒ) సంస్థ‌తో సంయుక్తంగా క‌లిసి రీజ‌న‌ల్ ఆయిల్ స్పిల్ కంటిన్జెన్సీ ప్లాన్ ను రూపొందించింది. బంగ్లాదేశ్‌, ఇండియా, మాల్దీవులు, పాకిస్తాన్‌, శ్రీ‌లంక దేశాల స‌ముద్ర‌ప్రాంతాల చుట్టుప‌క్క‌ల చ‌మురు కాలుష్యానికి సంబంధించిన ప్ర‌ధాన‌ సంఘ‌ట‌న‌ల విష‌యంలో స్పందించ‌డానికి త‌గిన విధంగా స‌న్న‌ద్ధం కావ‌డానికి అంత‌ర్జాతీయ స‌హ‌కారం ,ప‌ర‌స్ప‌ర స‌హాయం అందించేందుకు ఈ ప్ర‌ణాళిక‌ను రూపొందించ‌బ‌డింది.