పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధరిత్రి దినం సందర్భంగా మన గ్రహం పట్ల ఆదరణను, కృతజ్ఞతను వెలిబుచ్చారు.
“మనకు ప్రతి ఒక్కటీ అందించిన మన గ్రహం పట్ల ధరిత్రి దినాన్ని పురస్కరించుకొని ఇవే నా ఆదర, కృతజ్ఞత భావనలు” అని ప్రధాన మంత్రి ట్విటర్ లో రాసిన సందేశంలో పేర్కొన్నారు.
ఇంకా ‘భూ మాత పట్ల భక్తి శ్రద్ధలతో శిరసు వంచి ప్రణమిల్లుదాం.
ఈ గ్రహాన్ని కాలుష్యానికి తావు లేనిది గాను, ఎల్లప్పుడు అభివృద్ధి పథం వైపునకు పయనించేది గాను చేసేందుకు మనం అందరం పాటు పడదాం.
చెట్లు వాతావరణ మార్పును తగ్గిస్తాయి, అవి గాలిని శుభ్రపరుస్తాయి కూడా. మరిన్ని వృక్షాలను నాటి, ఆకుపచ్చని పృథ్విని సృజించుదాం అంటూ మనమంతా ప్రతిన బూనుదాం” అని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
On #EarthDay, reverence and gratitude to our planet that has given us everything. pic.twitter.com/qgVWPlfAPS
— Narendra Modi (@narendramodi) April 22, 2016