పిఎంఇండియా
ధర్‌తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జీ బలిదాన దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. నీళ్లు, అడవులు, భూముల పరిరక్షణ కోసం విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఆయన అజేయ ధైర్య సాహసాలతో పోరాడారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఆదివాసుల ఆత్మగౌరవం, సంస్కృతి, హక్కుల పరిరక్షణకు భగవాన్ బిర్సా ముండా జీ పూర్తి జీవితాన్ని అంకితం చేశారని శ్రీ మోదీ అన్నారు. మాతృభూమి కోసం సర్వస్వాన్నీ అంకితం చేసిన భగవాన్ బిర్సా ముండా జీ గాథ దేశంలో ప్రతి ఒక్క తరంలో దేశభక్తిని నింపుతూ ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ధర్‌తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జీ బలిదాన దినోత్సవం సందర్భంగా ఆయనకు కోటి కోటి నమస్సులు. జల్, జంగిల్, జమీన్‌లను కాపాడటానికి విదేశీ పాలనకు వ్యతిరేకంగా అజేయ సాహసంతో పోరాడారు బిర్సా ముండా. ఆదివాసీ సమాజ స్వాభిమానం, సంస్కృతి, హక్కుల రక్షణ ఆయన తన యావత్తు జీవితాన్ని అంకితం చేశారు. మాతృభూమి కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసిన ఆయన గాథ దేశంలో ప్రతి తరంలో దేశభక్తి పొంగిపొరలే టట్లు చేస్తుంది’’ అని పేర్కొన్నారు.
***
धरती आबा भगवान बिरसा मुंडा जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन। उन्होंने जल, जंगल और जमीन की रक्षा के लिए विदेशी हुकूमत के विरुद्ध अदम्य साहस के साथ संघर्ष किया। उनका पूरा जीवन जनजातीय समाज के स्वाभिमान, संस्कृति और अधिकारों की रक्षा को समर्पित रहा। मातृभूमि के लिए सर्वस्व… pic.twitter.com/C4y15CKfjM
— Narendra Modi (@narendramodi) June 9, 2026