పిఎంఇండియా
ధర్మం, విద్య, అహింస అన్న మూడు సద్గుణాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
‘‘ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాన్తిరుత్తమా
విద్యైకా పరమా తృప్తిరహింసైకా సుఖావహా’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ఆయన ప్రస్తావించారు.
ధర్మం పరమ మంచితనం వైపునకు తీసుకుపోతుంది. క్షమ అత్యున్నత స్థాయి మనశ్శాంతిని అందిస్తుంది. విద్య పరమ సంతృప్తిని కలిగిస్తుంది. అహింషే నిజమైన సంతోషానికి మూలమనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు ఇస్తోంది.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ
‘‘ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాన్తిరుత్తమా
విద్యైకా పరమా తృప్తిరహింసైకా సుఖావహా’’ అని పేర్కొన్నారు.
***
एको धर्मः परं श्रेयः क्षमैका शान्तिरुत्तमा।
— Narendra Modi (@narendramodi) September 21, 2026
विद्यैका परमा तृप्तिरहिंसैका सुखावहा॥ pic.twitter.com/OPxUBuq67h