Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల షూటింగ్‌లో రజత పతక విజేతలు సోనం ఉత్తమ్ మస్కర్.. ఎళావెనిల్ వాళరివన్‌.. విదర్శ కె.వినోద్‌లకు ప్రధానమంత్రి అభినందనలు


   సియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతక విజేతలు సోనం ఉత్తమ్ మస్కర్, ఎళావెనిల్ వాళరివన్, విదర్శ కె.వినోద్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. వీరు సాధించిన అద్భుత విజయం భవిష్యత్తులో ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా క్రీడల్లో మన క్రీడాకారుల కఠోర పరిశ్రమ, సమష్టి కృషి అద్భుత ఫలితమిచ్చాయి! ముఖ్యంగా నేటి మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన సోనం ఉత్తమ్ మస్కర్, ఎళావెనిల్ వాళరివన్, విదర్శ కె.వినోద్‌ల ప్రతిభ భారతీయులందరికీ అమితానందదాయకం. రజత పతక సాధనలో వారి జట్టు స్ఫూర్తి భవిష్యత్తులో ఎందరో క్రీడాకారులకు నవ్యోత్తేజమిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. PM @narendramodi

 

***