Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నమూనా దుకాణాలు, సంస్థల (ఉపాధి కల్పన మరియు సేవ నిబంధనలు) బిల్లు-2016కు మంత్రిమండలి ఆమోదం


మాడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) బిల్, 2016కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ బిల్లును ఇప్పుడిక రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపనున్నారు. దీనికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేయాలనుకుంటే, ఆ మార్పులతో అమలు చేసుకోవచ్చు; లేదా కేంద్రం ఆమోదించిన చట్టాన్నే నేరుగా అమల్లోకి తీసుకురావచ్చు. ప్రజలు, ఉద్యోగులు, కార్మిక ప్రతినిధులు, యాజమాన్యాల సంఘాలు, సమాఖ్యలతో ఇంటర్ నెట్లో విస్తృత చర్చలు.. రాష్ట్ర ప్రభుత్వాలతో త్రైపాక్షిక సమాలోచనల ద్వారా ఈ బిల్లుకు కేంద్రం తుది రూపును కల్పించింది.

ఈ ముసాయిదా నమూనా బిల్లులోని కీలకాంశాలు కింది విధంగా ఉన్నాయి:

• ఇది పది మంది, లేదా అంతకన్నా ఎక్కువ మంది కి పని కల్పిస్తున్న సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది; తయారీ రంగ యూనిట్ లకు వర్తించదు.

• ఈ బిల్లు ద్వారా సదరు సంస్థలు ఏడాదిలో 365 రోజుల పాటు ఎప్పుడైనా తెరచే / మూసివేసే స్వేచ్ఛను ఇస్తుంది.

• రాత్రి షిఫ్టులలో పనిచేసేందుకు మహిళలను కూడా అనుమతించాలి. అయితే అందుకోసం మహిళలకు సరైన వసతి, విశ్రాంతి గది, మరుగుదొడ్డి సదుపాయం, వారి గౌరవాన్ని పరిరక్షించగలిగే సరైన భద్రత, రవాణా సౌకర్యం వంటికి కల్పించవలసివుంటుంది.

• నియామకం, శిక్షణ, బదిలీలు, లేదా పదోన్నతులలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు.

• ఇందుకోసం సరళమైన ప్రక్రియతో కూడుకొన్న ఒక ఉమ్మడి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అవసరమవుతుంది.

• శ్రామికుల భద్రత, ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలకు సంబంధించి నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలను యజమాని స్వీకరించాలి.

• స్వచ్ఛమైన, సురక్షిత మంచినీటిని ఇవ్వాలి.

• మరుగుదొడ్డి, శిశు సంరక్షణ కేంద్రం, ప్రాథమిక చికిత్స కేంద్రం, ఫలహార శాలలను కొన్ని సంస్థలు ఒక బృందంగా కలసి ఏర్పాటు చేయాలి.. ఒకవేళ ఒకే సంస్థ ఏర్పాటు చేయడానికి స్థలం తక్కువగా ఉందనుకుంటేనో, లేదా ఇతరత్రా సమస్యలు ఉంటేనో.. ఈ విధంగా చేయాలి.

• జాతీయ సెలవు దినాలు వగైరాలకు తోడు ఐదు ఆర్జిత పండగ సెలవులను ఇవ్వాలి.

• రోజుకు 9 గంటల పనివేళల నుండి మరియు వారానికి 48 గంటల పనివేళల నుండిఅత్యున్నత నైపుణ్యమున్న శ్రామికులకు (ఉదాహరణకు ఐటీలో, బయోటెక్నాలజీ మరియు ఆర్ అండ్ డి విభాగం వంటి వాటిలో పనిచేసే శ్రామికులకు) మినహాయింపు ఇవ్వాలి. ఒక త్రైమాసికంలో ఓవర్ టైమ్ గరిష్ఠంగా 125 గంటలకు మించరాదు.

ఈ నమూనా బిల్లు ద్వారా చట్టపరమైన నిబంధనలలో ఏకరూపతను తీసుకురాగలదు. దీనితో రాష్ట్రాలు దీనిని అనుసరించడం సులభం అవుతుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన పని పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారం చేసుకోవడం సులభంగా మారుతుంది. ఉపాధి అవకాశాలు కూడా అందిరాగలవు.