Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవంబరు 2-4 తేదీ ల మధ్య థాయిలాండ్ సందర్శిస్తున్న ప్రధాన మంత్రి   


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్యాంకాక్ సందర్శిస్తున్నారు.  ఆయన ఆసియాన్, తూర్పు ఆసియా శిఖరాగ్రాల కు సంబంధించిన సదస్సుల్లో పాల్గొనడం తో పాటు, ఆర్ సెప్ చర్చల్లో కూడా పాల్గొంటారు. అలాగే ప్రధాన ప్రపంచ నాయకులందరితోనూ సమావేశమై కీలక ద్వైపాక్షిక, ప్రపంచ స్థాయి అంశాలపై చర్చిస్తారు.

 

బ్యాంకాక్ బయలుదేరి వెళ్లే ముందు చేసిన ప్రకటన లో ఆసియాన్ సంబంధిత సదస్సులు భారత విదేశాంగ విధానం లో ప్రత్యేకించి యాక్ట్ ఈస్ట్ పాలసీ లో కీలక ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు.  అలాగే తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు ప్రాధాన్యం గురించి ప్రస్తావిస్తూ ఇండో పసిఫిక్ ప్రాంతం పై మన ఆలోచనా ధోరణులు పంచుకునేందుకు అది చక్కని అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు.

 

2వ తేదీ సాయంత్రం బ్యాంకాక్ లో ‘స్వాస్‌దీ పిఎం మోదీ’ కమ్యూనిటీ సమావేశం సభ్యుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.  థాయిలాండ్ లోని భారతీయ సంతతి ప్రజల సేవల ను కొనియాడిన ప్రధాన మంత్రి వారి తో మాట్లాడేందుకు తాను ఎదురుచూస్తున్నానన్నారు.